అనంతపురం ( జనస్వరం ) : నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె27వ రోజుకు చేరుకోగా జనసేన పార్టీ తరపున రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత వారి సమ్మెకు సంఘీభావం తెలిపారు. అనంతరం అంగాన్వాడీ వర్కర్లతో కలిసి ఎస్మా చట్టప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయబద్ధమైన డిమాండ్ల అమలు కోసం అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెను అణచివేయాలనే ఉద్దేశంతో జగన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం హేయమైన చర్య అని అన్నారు. ఈ నిర్ణయం నియంత పాలనకు ప్రతీకగా ఉందని ప్రభుత్వం ఇటువంటి నల్లచట్టాలను ఎన్ని అంగన్వాడిలపై ప్రయోగించిన మీరు భయబడాల్సిన పనిలేదని ఇక రెండు నెలలు ఆగితే ఈ వైకాపా ప్రభుత్వాన్ని జగన్ రెడ్డిని శాశ్వతంగా ఇంటి దగ్గరే కూర్చెబెడదామని అన్నారు. మీ న్యాయ బద్దమైన సమానపనికి సమాన వేతనం గ్రాట్యుటీ అమలు చేయడం మొదలగు అన్ని డిమాండ్ల అమలుకు జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని అన్నారు. ఈ విషయాన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పలు సందర్భాల్లో చెప్పారని గుర్తుచేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అంగన్వాడీలు 27 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే నీకు కనిపించడలేదా ఇదే జిల్లాకు చేదిన వ్యక్తేకదానువ్వు నీ రాజకీయ భవిష్యత్తు కోసం నియోజకవర్గమైతే మారావు కానీ అంగన్వాడిల సమస్యలు పట్టవా అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది.