బొబ్బిలి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకి మద్దతు తెలిపిన జనసేన పార్టీ

      బొబ్బిలి ( జనస్వరం ) :  గత కొన్ని రోజులుగా బొబ్బిలి మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి  బాబు పాలూరు గారు, బొబ్బిలి మండల అధ్యక్షుడు సంచాన గంగాధర్ గారు, పల్లెం రాజా, రేవళ్ల కిరణ్ కుమార్, ఎందవ సత్యనారాయణ, ఆబోతుల రాజు, సాయిరాం, వీర మహిళలు అలివేలు గారు, యామిని గారు పాల్గొన్నారు. బాబు పాలూరు గారు మాట్లాడుతూ, 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలిచ్చారో, ఆ హామీలని నిలబెట్టుకోవాలని, కరోనా టైంలో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు జగన్ మొండి చెయ్యి చూపించకుండా, వాళ్లకి ఇస్తామన్న – సమాన పనికి సమాన వేతనం, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చెయ్యడం వంటి హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసారు. మీరు అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన కపట హామీలను నిలబెట్టుకోలేకపోతే, 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా మీ వైసిపి పార్టీకి అర్హత లేదని అన్నారు. ఓవైపు సమ్మె కాలంలో జీతాలు లేక కార్మికులు, మరోవైపు బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మరియు ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి, వాళ్ల డిమాండ్లను నెరవేర్చాలని బాబు పాలూరు గారు కోరారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు సమ్మెలో ఉన్నప్పుడు సచివాలయం ఉద్యోగస్తులతో తాళాలు పగలకొట్టించి మరీ పని చేయిస్తున్నారు. మరి ఇప్పుడు మున్సిపాల్ కార్మికులు సమ్మె లో కూర్చుంటే, ఎవరితో ఆ పారిశుద్ధ్య పని చేయిస్తారని వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఎంప్లాయిస్, చైర్ పర్సన్, మున్సిపల్ శాఖామంత్రి MLAలతో చెత్తను ఎత్తించగలరా జగన్ రెడ్డి అని జనసేన పార్టీ తరపున నిలదీసారు. మరో 2 నెలల్లో వైసిపి ప్రభుత్వం పోయి మన జనసేన, తెదేపా ప్రజా ప్రభుత్వం రాబోతుందని, మన హయాంలో మీ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనవి అమలు చేసే ప్రయత్నం తప్పనిసరిగా మన  పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారు చేస్తారని బాబు పాలూరు గారు కార్మికులకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way