తిరుపతి ( జనస్వరం ) : ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు జనసేన పిఎసి కార్యాలయం, జనసేన చిత్తూరు జిల్లా కార్యాలయాల్లో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు పుష్పగుచ్చాలు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ నూతన సంవత్సరాది రోజున ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలనను అంతమొందించడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న చీకట్లు తొలగి అభివృద్ధి, సంక్షేమ వెలుగులు ప్రజ్వరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జనస్వరం న్యూస్ క్యాలెండర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరామహిళలు కలవటం జరిగింది