- రెండు నెలలైనా తాగునీటి సరఫరా చేయడంలో విఫలమైన వైసీపీ ప్రజా ప్రతినిధులు…
- సామాన్య ప్రజలు, ప్రతిపక్ష నాయకులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందించని వైనం
- గుత్తిలోని పలు కాలనీలను సందర్శించి గుత్తి మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లిన గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ, గుత్తి జనసేన నాయకులు
గుంతకల్ ( జనస్వరం ) : గుత్తి ఆర్ఎస్ నందు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో భాగంగా 8, 9 వార్డులలో జనసేన పార్టీ నాయకులు పర్యటించి సామాన్య ప్రజల ఎంతో ఆవేదన చెందుతున్న ప్రధాన సమస్య అయిన తాగునీటి విడుదల గురించి చరవాణి ద్వారా మున్సిపల్ కమీషనర్ ని జనసేన పార్టీ తరఫున ప్రశ్నించి తక్షణం ఇక్కడికి వచ్చి సమస్యలను చూడాలని కోరగా ఆయన జనసేన నాయకులతో కలిసి కాలనీని సందర్శించి తక్షణం చర్యలు తీసుకొని రెగ్యులర్ గా నీటిని వదిలేలా బాధ్యత తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య, జనరల్ సెక్రెటరీ నాగయ్య, హేమంత్ కుమార్, అఖండ భాష , ఓబులేష్, క్రాంతి కుమార్, వెంకటేష్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, కాపు సంక్షేమ సేన నాయకులు బుర్ర అఖిల్ రాయల్, కసాపురం నందా, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.