చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలో గల గ్రంధాలయంలో చాలా మంది యువత అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ కొసం ప్రిపేర్ అవుతున్నారు. కానీ అక్కడ వాళ్ళకి అవసరం ఐన బుక్స్ గానీ ఇంకా వసతులు గానీ లేవు. గ్రంధాలయం శిధిలావస్థలో ఉన్నది. దీనికి 6 నెలలు కింద కొత్తది కట్టడానికి బొత్సా సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మరియు చిన్న శ్రీను గారు శంకు స్థాపన చేసి వెళ్లారు. కానీ ఇప్పటకీ దాని గురుంచి పట్టించుకోలేదు. పంచాయతీ పరిధిలో ప్రజల నుండి గ్రంథాలయం పన్ను వసూలు చేస్తున్నారు. దాన్ని ఏ రోజు కూడా గ్రంథాలయం అవసరాలు నిమిత్తం మరమ్మతులు నిమిత్తం పుస్తకాలు నిమిత్తం ఏ ఒక్కరోజు వినియోగించలేదు. చదువుతున్న విద్యార్థులు చాలామంది విద్యాశాఖ మంత్రి గారి బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి మరియు పంచాయతీ అధికారుల దృష్టికి ఎంపీ అయినటువంటి బెల్లాన చంద్రశేఖర్ గారికి చాలాసార్లు అక్కడ చదువుకున్న విద్యార్థులు విన్నవించుకున్నారు. కానీ ఇప్పటివరకు గ్రంధాలయ నిర్మాణం చేపట్లేదు. అందుకు అనీ జనసేన పార్టీ తరఫున అక్కడ ఉన్న విద్యార్థులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అధికారుల దృష్టికి మరియు అవసరం అయితే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వారికి న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేయడం జరిగింది. అలాగే ఈమధ్య గ్రూప్-2 నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించిన పుస్తకాలు జనసేన పార్టీ తరఫున వాళ్లకి అందిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గరివిడి మండల అధ్యక్షులు పెద్ది వెంకటేష్, సీనియర్ నాయకులు బొడశింగి రామకృష్ణ, అగురు వినోద్ కుమార్, ధన్నాన యేసు, గొల్ల బాబు, బాలకృష్ణ, కుమార్, రామకృష్ణ, జగదీష్, చిరంజీవి, సత్య , గొర్లె శ్రీను తదితరులు పాల్గొన్నారు.