మదనపల్లి ( జనస్వరం ) : రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ‘నాడు-నేడు’ పథకం నిధుల కొరతతో పడకేసి 20 శాతం కూడా పూర్తి కాలేదని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ మైఫోర్స్ మహేష్ ఆరోపించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నాడు, నేడు పథకం అమలుపై మండిపడ్డారు. పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లె నియోజకవర్గంలో పలు ప్రభుత్వం పాఠశాలు పరిశీలించిన మీదట వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ ఎక్కడ చూసినా పనులు అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తన ఖాతాలో వేసుకుని కమిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కక్కుర్తి పడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్భాటాల కోసం నిధులు మళ్ళించి పనులు నిలిచిపోతున్నాయని మండిపడ్డారు. మెటీరియల్ కాంట్రాక్టర్లక చెల్లింపులు లేక పనులు చేసే నాధుడు కరువైయ్యారు. మితిమీరిన అధికార నేతల జోక్యం కారణంగా పనులు చేయడంలో జాప్యం జరుగుతోంది. చాలా చోట్ల అరకొరగా వచ్చిన నిధులు పిల్లర్ల వరకే సరిపోయాయి. నిధుల కొరతతో గది నిర్మాణం ముందుకు వెళ్లలేదు. ఫలితంగా విద్యార్థులు చెట్ల కింద విద్య అభ్యసిస్తున్నారు. ఇసుక, సిమెంట్ కూడా సకాలంలో రాక పనులు జరగడంలేదు. ఇప్పటివరకూ విడుదల చేసిన నిధులతో పనులు చేసిన ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు రావాల్సిన వాటికోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు, నేడు రంగులు చేయడానికే పరిమితం అయిందని, పైన పటారం లోన లోటారం అన్న చందగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.