నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ 40వ డివిజన్ స్థానిక నాయకుడు చిత్తూరు రాము ఆధ్వర్యంలో వీర మహిళల చేతులమీదుగా జనసేన పార్టీ పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,చిరంజీవి యువత ఉపాధ్యక్షులు జనసేన సీనియర్ నాయకులు ఏటూరు రవికుమార్,జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిరంజీవి యువత నాయకులు కారంపూడి కృష్ణారెడ్డి,జనసేన సీనియర్ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిటీ నిర్దేశకులుగా వేములపాటి అజయ్ గారు ఎన్నికైన నుంచి ప్రతి డివిజన్లో జనసేన పార్టీ జెండా ఎగరవేయాలని, ప్రతిగ డపకి జనసేన పార్టీ ఆశయాలను చేరవేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గత పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మూలపేట నాయకులు చిత్తూరు రాము ఆధ్వర్యంలో వీర మహిళ చేతుల మీదుగా జనసేన పార్టీ జండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ పతాకాన్ని ప్రతి డివిజన్ లో ఎగురవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మా ప్రియతమ నాయకుడు విచ్చేసినప్పుడు ఒక రోజుకే డివైడర్ల మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దు యాక్సిడెంట్ జరుగుతాయని నియంత్రించిన అధికారులు మాటలు విని మేము ఫ్లెక్సీలు తొలగించాం. కానీ గత మూడు రోజులుగా ఉన్న ఫ్లెక్సీ వల్ల కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి వద్ద ఒక వ్యక్తి తల పగిలి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. ఎవరికైనా ఓకే చట్టం వర్తించేలా అన్ని ఫ్లెక్సీలు తీయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మరో 60 రోజుల్లో ప్రజా ఈ ప్రభుత్వం కుప్ప కూలుతుంది.అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. గతంలో వరద బాధితులకు ఇచ్చే నష్టపరిహారం సరిపోదని రచ్చ చేసిన జగన్మోహన్ రెడ్డి..ఆ పరిహరం కూడా ఇప్పటికీ అందించ లేకపోయారు. అదేవిధంగా అన్నదాతలకి నష్ట పరిహారం లెక్క అంతా ఫ్లైట్లోనే లెక్కేసి ఇప్పటికీ వారికి అందకుండా ఉంది. అభివృద్ధి జరగాలన్నా సామాన్యులకు న్యాయం జరగాలన్నా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తెలిపినట్లుగా జనసేన తెలుగుదేశం పార్టీలను గెలిపించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,జనసేన సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరి రవి,జనసేన అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి,చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు ఈగి సురేష్,జనసేన సీనియర్ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి,చిత్తూరు రాము,షేక్ షాన్ బాషా, అలియాస్ పుచ్చా, టీడీపీ నాయకులు అన్నంగి ప్రసాద్, మురళీ మోహన్ రెడ్డి, మున్నా రెడ్డి రెబాల, జనసేన నాయకులు మురళి రెడ్డి, గుర్రం కిషోర్, నాగరత్నం యాదవ్, కృష్ణవేణి, రేణుక, వర్షన్, భారతి, గంగిశెట్టి నరసింహ, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు సుధామాధవ్ తదితరులు పాల్గొన్నారు.