Search
Close this search box.
Search
Close this search box.

ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలను నెరవేర్చాలని ప్రభుత్వానికి బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్

       న్యూస్ ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్-381 రాష్ట్ర అధ్యక్షులు అందె రాజేష్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులోని సారాంశం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా రూపకల్పన చేసి 1,34,000 మంది ఉద్యోగులకు వివిధ శాఖల క్రింద ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టిన వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయం ప్రభుత్వ రంగ వ్యవస్థ. ఈ వ్యవస్థలో మొత్తంగా 20 కేటగిరీ విభాగాలకు చెందిన ప్రతి శాఖ నుండి ఉద్యోగ అవకాశం కల్పించి ఉన్నారు. గ్రామ/వార్డు సచివాలయం ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా విద్యుత్ సంస్థలచే నియామకం పొంది పట్టణ/గ్రామ ప్రాంతాల్లో గ్రామ/వార్డు సచివాలయం పరిధిలో 4 సంవత్సరాలు కాలంగా విధులు నిర్వహిస్తున్న (7500) ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II) ఉద్యోగులు. ఈ ఉద్యోగులందరూ విద్యుత్ సంస్థల యందు అధికారుల పర్యవేక్షణలో గ్రామాలలో ప్రజలకు కలుగుతున్న విద్యుత్ సంబంధిత అంతరాయాలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నారు. వీరికి ఉద్యోగం కల్పించి వేతనాలు చెల్లిస్తున్న విద్యుత్ సంస్థలు 4 సంవత్సరాల కాలంగా సంస్థల యందు రెగ్యులర్ చేయకుండా సర్వీస్ నిబంధనలు అమలు చేయకుండా ప్రమోషన్ ఛానల్ కల్పించకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు. విద్యుత్ సంస్థలో గతంలో ఉన్నటువంటి ప్రజా అవసరాల రీత్యా, ప్రజలకు నిరంతర సదుపాయం కల్పించడం కొరకు సంస్థలో జూనియర్ లైన్ మెన్ అనే పోస్టులు ఉండేవి, కానీ విద్యుత్ సంస్థలు ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II) పోస్టులు విధానం కొత్త వ్యవస్థ అనే సచివాలయాన్ని బూచిగా చూపిస్తూ JLM కేడర్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే JLM కేడర్ కి కల్పించే వేతనాలు చెల్లించాల్సి వస్తుందని, కావాలనే సంస్థలకు ఆర్థిక వనరుల సేకరణలో ప్రధాన ఉద్యోగులైనటువంటి, ప్రజలకు విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెనువెంటనే కాలంతో మరియు సమయంతో భేదం లేకుండా ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న ఉద్యోగులైనటువంటి ఎనర్జీ అసిస్టెంట్లను (JLM Gr-II ) లను శ్రమ దోపిడికి గురి చేస్తూ వీరికి ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా విద్యుత్ సంస్థలు 2019 సంవత్సరంలో నియామకం అయినటువంటి 7500 మంది విద్యుత్ ఉద్యోగులు అంటే ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II ) అయిన మేము శ్రమదోపిడికి గురిచేస్తూ, మేము పలుమార్లు JLM కేడర్ ని ఎందుకని తుంగలో త్రొక్కి ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II ) కేడర్ ని క్రొత్తగా ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఏమున్నది అని ప్రశ్నిస్తున్నప్పటికీ, గతంలో ఉన్నటువంటి ఉద్యోగుల అందరిని కూడా కాంట్రాక్ట్ (CJLM) గా నియమించి రెండు సంవత్సరాల కాలం ప్రొబేషనరీ అనంతరం వారిని JLMగా గుర్తించి వారిని రెగ్యులర్ చేసి పాత సర్వీస్ నిబంధనల ప్రకారంగా కల్పించవలసిన వాటిని ఎందుకని మరుగున పడేసి, ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II ) అనే ఒక కొత్త పోస్ట్ సృష్టించి ప్రభుత్వం మరియు యాజమాన్యం ఉద్యోగులను ప్రక్కదారి పట్టిస్తూ, గత 4 సంవత్సరాలు కాలంగా ఎటువంటి వివరణ ఇవ్వకుండా ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II ) ఉద్యోగ నియామక ప్రక్రియను JLM ఉద్యోగులతో పోల్చలేము అని దోబూచులాడుతున్నాయి. యాజమాన్యం ప్రజా అవసరాల కొరకు ఉద్యోగం కల్పించబడిన ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II ) ఉద్యోగులను ఉద్దేశ్య పూర్వకంగా వారికి కనీస ఉద్యోగ సదుపాయాలు కల్పించకుండా కాలం గడిపేస్తున్నాయి.
           ఒకే సంస్థలో, ఒకే పని కలిగిన ఉద్యోగులకు, క్రొత్తగా వచ్చిన వారికి ఒక విధంగా, సీనియర్స్ కి మరొక విధంగా సర్వీస్ నిబంధనలు అంటే రెండు రకాలుగా విభజిస్తున్న తరుణం లో వాటిని అమలు చేయ వద్దు అని పలుమార్లు వాటిపై మా యొక్క అభ్యంతరాలను ఉద్యోగ సంఘం తరఫున వ్యక్తపరచినప్పటికీ, వాటిపై ఉన్నటువంటి పూర్తి సందేహాలను తొలగించడంలో యాజమాన్యం ముందుకు రావడం లేదు. అనేక పర్యాయాలు యాజమాన్యం దృష్టికి ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II ) ఉద్యోగుల సమస్యలను మా యొక్క ఉద్యోగ సంఘం తరఫున విన్నవించుకున్నప్పటికీ, వాటిని పరిగణలోకి తీసుకోకుండా JLM ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాల్లో కొన్ని రకాల ALLOWANCES (MEDICAL,CYCLE, CONVEYANCE) చెల్లించకుండా ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II ) నియామక ప్రక్రియ JLM నియామక ప్రక్రియ ఒకటైనప్పటికీ, కొత్త నిబంధనలు అమలు చేయాలని ఉద్యోగుల సంక్షేమాన్ని తుడిచేసే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తున్నది. ఈ విధమైన సంస్కరణలతో ఉద్యోగుల వర్గీకరణ చేయడం వలన ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II) ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని యాజమాన్యం వద్దకు తీసుకెళ్లినప్పటికీ, విద్యుత్ సంస్థలు మా యొక్క అభిప్రాయాలను పరిగణలో తీసుకోకుండా అమలు చేసే విధంగా చర్యలకు పాల్పడుతున్నది. ఒకే సంస్థలో పనిచేయుచున్న ఉద్యోగులకు వీరికి పనిలో వ్యత్యాసం లేనప్పటికీ, వీరికి కొత్తగా నిబంధనలు రూపొందించాలనే ఉద్దేశ్యం తో కొత్త వేతనాలు చెల్లించడం ఎంత వరకు సమంజసం. ఒకే శాఖలో పనిచేయుచున్న ఉద్యోగులందరికీ ఒకే రకమైన నిబంధనలు కల్పించాలని AP Electricity Act రూల్స్ లో ఉన్నది, కానీ విద్యుత్ సంస్థలు వాటికి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. విద్యుత్ సంస్థలో ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II ) ఉద్యోగులు ఈ క్రింది ఉన్న స్టాఫ్ లో భాగస్తులు. O&M స్టాఫ్ వీరి డ్రాఫ్ట్ ఈ విధంగా ఉంటుంది 1) JLM 2) ALM 3) LM 4) LI 5) SLI 6) FOREMEN ప్రస్తుతం ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II) అనే కేడర్ ని కొత్తగా నియామకం చేసి ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II) ఉద్యోగుల యొక్క విధులు కూడా రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగులతో సమానంగా ఉన్నవి. కానీ ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II) ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులతో విభజించి కొత్త వేతనాలు చెల్లిస్తూ కొత్త కేడర్ ని అమలు చేస్తున్నారు. ఈ విధంగా వీరికి సమాన పనికి సమాన వేతనం లభించకుండా సుమారుగా నెలకు 13000/- వరకు నష్టపోతున్నారు.

            గడిచిన 4 సంవత్సరాల కాలంగా ఉద్యోగలకి హక్కుగా సంక్రమించే కనీస సదుపాయాలను కూడా ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II ) ఉద్యోగులకు విద్యుత్ సంస్థలు కల్పించకుండా అవి ఏమిటి అనగా (casual leaves,medical leaves,peternity leaves,optional holidays,study leaves, Encashment leaves), ఇతర వేతన అలవెన్సులు అమలు చేయకుండా ప్రమోషన్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II) ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 160 మందికి పైగా మరణించి, 300 మంది వరకు అంగవైకల్యం పొంది యున్నారు. వీరిని సంస్థలు న్యాయబద్దంగా ఆదుకోవటం లేదు. ఉద్యోగులు చనిపోవుటకు గల కారకులైన వ్యక్తుల పై చర్యలు తీసుకోవటం లేదు. గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులందరికీ వారి యొక్క మాతృ సంస్థలు సర్వీస్ నిబంధనలు అమలు చేసి, ఉద్యోగలకు హక్కుగా సంక్రమించే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ ప్రమోషన్స్ కూడా కల్పిస్తున్నారు. విద్యుత్ సంస్థలచే నియమించబడిన ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II ) లను విద్యుత్ ఉద్యోగులుగా గుర్తించి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 39 (D) ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ, సర్వీస్ నిబంధన వెంటనే అమలు చేసి ప్రమోషన్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నాము. విద్యుత్ సంస్థలో ఉద్యోగం కల్పించి పని చేయించుకుంటున్న సంస్థలు, అధికారులు ఉద్యోగుల సంక్షేమం మరిచి కనీసం safety equipment కూడా ఇవ్వకుండా, పర్యవేక్షణ లోపం తో విధులు నిర్వర్తింప చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు అత్యధికంగా ప్రమాదానికి గురి కాబడి మరణించిన ఏకైన ఉద్యోగులు 2019 సం.. ఎనర్జీ అసిస్టెంట్ (JLM Gr-II). భారతదేశ చరిత్రలో విద్యుత్ శాఖలో ఉద్యోగులు అత్యధికంగా మరణించిన రాష్ట్రం మనదే కావటం గమనార్హం. మా సమస్యలు పరిష్కరించండి అని కోరుటకు కూడా, సంస్థల అధికారులు కనీసం అవకాశం కల్పించడం లేదు. ఇదేమిటి అని ప్రశ్నిస్తున్న వ్యక్తులను, యూనియన్ల నాయకులను సైతం విద్యుత్ సంస్థలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కుటుంబ పోషణ మరియు బ్రతకటం కోసం ఉద్యోగంలో చేరితే, ఉద్యోగం కంటే బ్రతికుంటే చాలు అనుకునే విధంగా ఈ సంస్థలు, ప్రభుత్వం తీరు ఉన్నది. దయచేసి మా న్యాయ బద్దమైన డిమాండ్స్ ని ప్రభుత్వం అమలు చేసే విధంగా నిలదీయాలని మిమ్ములను అభ్యర్థిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way