గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : వెదురు కుప్పం మండలం, కొమరగుంట పంచాయితీ, కొమరగుంట గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. చిన్న కొమరగుంట, పెద్ద కొమరకుంట గ్రామంలో ప్రతి ఇల్లు సందర్శిస్తూ భవిష్యత్తు గ్యారెంటీ లోని విలువైన అంశాలతో కూడిన కరపత్రాలను పంచి పెట్టారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగు దేశంతో పొత్తు కుదిరిందని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జనసేన – తెలుగుదేశం మైత్రి కొనసాగాలని కోరారు. మరోసారి వైసీపీ వస్తే ప్రజలు ఇళ్లలో ఉండలేని స్థితి వస్తుందని, తల్లికీ, చెల్లికీ విలువ ఇవ్వని జగన్ మన ఆడపడుచులకు భద్రత ఎలా ఇస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోని తల్లులను, చెల్లెళ్లను తిట్టించడం జగన్ తీసుకొచ్చిన సంస్కృతని, 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయ్యారని లెక్కలు చెబితే కనీస చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కాదు, జగన్ ను మార్చాలని ప్రజలు ఫిక్స్ అయ్యారని తెలియజేశారు. చంద్రబాబు కుటుంబ వేదనను పవన్ కళ్యాణ్ మానవత్వంతో అర్ధం చేసుకున్నారని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సుందరం కావాలంటే జనసేన, తెలుగు దేశం ప్రభుత్వంతోనే సాధ్యపడు తుందని ధీమా వ్యక్తం చేసారు. కొమరగుంట గ్రామాన్ని ఆదర్శ వంతమైన గ్రామంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. వెదురుకుప్పం మండలాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వెదురు కుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, నియోజకవర్గ బూత్ కన్వినర్ యతిశ్వర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, వెదురుకుప్పం మండల ప్రధాన కార్యదర్శి ముని, మండల కార్యదర్శి బెనర్జీ, కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్. ఉపాధ్యక్షులు సూర్య నరసింహులు, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శులు రాఘవ, నరేష్, పాల సముద్రo మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గం కార్యదర్శి అన్నామలై, యం యం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, జనసేన నాయకులు నాదముని మరియు జనసైనికులు పాల్గొన్నారు.