అనంతపురం ( జనస్వరం ) : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పుస్కరించుకుని అనంతపురం నగరంలోని పాతవూరు చెన్నకేశవ స్వామి దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో పెండ్యాల హరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత భక్తుల సౌకర్యార్థమై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైన చారిత్రాత్మక ప్రదేశమని ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి వేలసంఖ్యలో భక్తులు వస్తారని అన్నారు. వారి సౌకర్యార్థమై గడిచిన మూడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. స్వామి వారి దివ్య ఆశీస్సులు ప్రజలపై ఎల్లపుడూ ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పెండ్యాల చక్రపాణి, పెండ్యాల మహేష్, కార్తిక్, విశ్వ కళ్యాణి, సుమలత శైలజ తదితరులు పాల్గొనడం జరిగింది.