నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలంలో అమాకం గ్రామంలో అధికంగా నీటి సమస్య అలాగే ఆ యొక్క గ్రామంలోని నూతనంగా నిర్మించబోతున్న శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి గుడి దగ్గర నీటి వల్ల చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఆ గ్రామ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ పాలకులు నాయకులు సంప్రదించి వారి కష్టం తెలియజేయగా, వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు నెలిమర్ల జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీపతి లోకం మాధవి గారికి వారి కష్టాన్ని తెలియజేశారు. విషయం విన్న లోకం మాధవి గారు మానవతా దృక్పథంతో స్పందించి ప్రజలు త్రాగు నీరు లేకుండా ఇబ్బంది పడగొడదని మరియూ వారి దాహం తీర్చడం కొరకు తన సొంత నిధుల నుంచి సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేసి బోరు వేయించడం జరిగింది. ఈ బోరు వల్ల చుట్టుపక్కల ప్రజలుకు నీటి కొరత లేకుండా ఉంటుందని ప్రజలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసెన పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్, సీనియర్ నాయకులు తోట్టడి సూర్య ప్రకాష్, గుడివాడ జమ్మి రాజు, గుడివాడ శేఖర్, కోరాడ అప్పారావు, అట్టడ ప్రమీల, కొన శివ, పండ్రంకి మహేష్, పిల్లా నాని మరియు అమకాo గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.