గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో, కార్వేటినగరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలతో త్వరలో పవన్ కళ్యాణ్ ను కలవనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా పార్టీకి అందించినటువంటి సేవలు, పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు, ప్రజల పక్షాన చేసిన పోరాటాలు, ప్రస్తుతం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వివరాలతో పాటు, భూత భవిష్యత్తు వర్తమాన ప్రణాళికను క్షుణ్ణంగా పవన్ కళ్యాణ్ కు వివరించనున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తులో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇంకా ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రణాళికను, అదేవిధంగా జనం కోసం జనసేన కార్యక్రమాన్ని చేపట్టారు. వినూత్నమైన సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులో స్థానం సంపాదించడమే ధ్యేయంగా, విముక్తి ఆంధ్రప్రదేశ్ కట్టబడి ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబులు నాయకత్వాన్ని బలపరిచి, నియోజకవర్గంలో కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ, ఉమ్మడిగా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మా ముందున్న కర్తవ్యం జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, భవిష్యత్తు గ్యారంటీలోని ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం, జనసేన తెలుగుదేశం సంయుక్తంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని, లేదా ఇంకెవరు నిలబడ్డా వారిని ఇంటికి పరిమితం చేసే విధంగా ముందుకెళ్లడమే మా ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, కార్వేటి నగర్ మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, చిత్తూరు జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి దేవా, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, జీడీ నెల్లూరు మండల బూత్ కన్వీనర్ తులసి రామ్, నియోజకవర్గ కార్యదర్శి లోకేష్, ఎంఎంవిలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, కొట్టార్వేడు పంచాయతీ అధ్యక్షులు వినోద్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, వెదురుకుప్ప మండల యువజన అధ్యక్షులు సతీష్, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు గోపతి మునిరత్నం శెట్టి పాల్గొన్నారు.