గుడివాడ ( జనస్వరం ) : స్థానిక 25 వ వార్డు పెదఏరికపాడు గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉన్న వాటర్ పైపు లీక్ సమస్యను ఆర్కే వారియర్ సభ్యులు మున్సిపాలిటీ అధికారులకు తెలియజేయగా వెంటనే స్పందించి మరమ్మత్తులు చేసిన గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులు. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పెదఏరికపాడు వార్డులో వాటర్ పైప్ లీకేజ్ అయ్యి ఆ నీరు రోడ్ల మీద రావడం వల్ల రోడ్లు గుoతల మయం కావడంతో ప్రజలు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడడంతో ఆ సమస్యను మున్సిపల్ అధికారులకు తెలియజేయగా వెంటనే స్పందించి వాటర్ పైపును మరమ్మతులు చేయడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో ఉన్న ప్రజలు తమ వార్డు సమస్యలను ప్రభుత్వ అధికారులు తెలియజేస్తే వెంటనే ఆ సమస్య తీరుతుంది.. అంతేగాని మనకెందుకులే అని ఆలోచిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఆ సమస్యలు కూడా అలాగే ఉంటాయని తెలియజేశారు. ఈ సమస్యని అధికారులకు చేరవేసిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ కి వార్డు ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, దివిలి సురేష్ ,మట్ట జగదీష్, చరణ్ తేజ్, నాగసాయి, లంకా రాంబాబు, మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.