• పాలన అంటే వాళ్లకు కామెడీ అయిపోయింది
• వైసీపీలో మాట్లాడే వారిలో ఎక్కువ మంది ఐటమ్ రాజాలు, ఐటమ్ రాణులే
• ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదు
• జన సైనికులు, వీర మహిళలే పార్టీకి ఆక్సిజన్
• ఓటు హక్కు ఆంధ్ర ప్రదేశ్ కి మార్చుకోవడం వల్లే తెలంగాణలో వినియోగించుకోలేదు
• నెల్లూరు సిటీ, సూళ్ళూరుపేట, కొవూరు నియోజకవర్గాల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు
నెల్లూరు ( జనస్వరం ) : జిల్లా జనసేన పార్టీ సమీక్ష సమావేశాల్లో భాగంగా రెండో రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ ఫంక్షన్ హాళ్ళో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట, కోవూరు, నెల్లూరు సిటీ నాయకులతో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు, జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు జరిగాయి.ఈ సమావేశంలో నాగబాబు గారు మాట్లాడుతూ అందరూ కలిసి పనిచేసుకుంటూ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. టీడీపీ, జనసేన అలయన్స్ లో భాగంగా ఎవరికి సీట్ ఇచ్చినా అందరూ కలిసి వైస్సార్సీపీని ఎదుర్కోవాలని చెప్పారు. అలాగే పార్ట్ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని నాగబాబు చెప్పారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ నేత సోమిరెడ్డి పోరాడుతున్నారని, ఆయనకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు ఖాళీ చేసిందని.. ఆ ఖాళీని భర్తీ చేయాలంటే కనీసం దశాబ్దాల కాలం పడుతుందని అన్నారు .దేవాలయంలాంటి శాసన సభలో బూతులు మాట్లాడటం, స్టేజ్ మీద డ్యాన్స్ లు వేయడం తప్ప వైసీపీ నాయకులకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు నాగబాబు. జిల్లాకు చెందిన ఓ నేత గతంలో పోలవరాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామన్నారని, తొందరెందుకంటూ వ్యంగ్యంగా మాట్లాడారని, ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారని అన్నారు.సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వైనాట్ 175 అంటున్నారని, దేవుడే దిగి వచ్చినా ఏ ఒక్క పార్టీ అన్ని స్థానాల్లో గెలవలేదని చెప్పారు. ఎన్నికలకు ఇంకా 100 రోజులే టైమ్ ఉందని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేసులకు భయపడొద్దని ధైర్యం చెప్పారు. జనసేనకు బలమైన న్యాయవిభాగం ఉందని, అన్నీ వారు చూసుకుంటారని భరోసా ఇచ్చారు. ఓపికతో, సహనంతో రాజకీయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు, జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరి రవి కుమార్, రాష్ట్ర నాయకులు పావుజెన్నీ చంద్రశేఖర్ , నెల్లూరు జిల్లా చిరంజీవ యువత అధ్యక్షులు మార్కెట్ సురేష్,పవన్ కళ్యాణ్ యువత జిల్లా అధ్యక్షులు గుడి హరి రెడ్డి, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు బద్ధిపూడి సుధీర్, నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ , కోవూరు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీనివాసులు రెడ్డి, జనసేన రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, సుందర రామిరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు చదలవాడ రాజేష్, ఐటీ వింగ్ అధ్యక్షుడు నక్కా శివకృష్ణ, జనసేన నాయకులు కాకు మురళి, హేమ చంద్ర యాదవ్, శరవణ, షాజహాన్, వీర మహిళలు నాగరత్నం, షేక్ అలియా, సుభాషిణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.