బొబ్బిలి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామిఅదేశాలు మేరకు బొబ్బిలిలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు జనసేననేతలు మద్దతు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులకు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా పారది జనసేన ఎంపీటీసీ అభ్యర్థి బంటుపల్లి దివ్య మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. రానున్న ఎన్నికలలో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఇంకో 3 నెలలులో మీ సమస్యలన్నింటికి పరిస్కారం దొరుకుతుందని తెలిపారు. ఈ సమ్మెలో జనసేన నాయకులు లంక రమేష్, బెల్లాన శ్రీను, పొట్నూరు జన వీరమహిళలు, లక్ష్మి, వరలక్ష్మి, బుజ్జి, హేమ, గీత, స్వాతి, భారతి, గౌరీ, రమ, అశ్విని, నీలిమ, శోభ మరియు దేవి పాల్గొని మద్దతు తెలిపారు.