గుంతకల్ ( జనస్వరం ) : ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు పోరుగు రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని ప్రగల్బాలు పలికి, ఇప్పుడు అధికారం లోకి వచ్చి అండగా ఉండడం అంటే ఇచ్చినమాట తప్పడమేనా జగన్ మామ అని జనసేన నాయకులు నియోజకవర్గ సమన్వయకర్త వాసగిరి మణికంఠ ఎద్దేవా చేశారు. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగవ రోజు నిరవధికంగా సమ్మెలో భాగంగా శుక్రవారం పామిడి పట్టణ పరిధిలోని నిర్వహిస్తున్న అంగన్వాడీల సమ్మెకు పామిడి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ధనుంజయ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వారి కనీస హక్కుల కోసం ఉద్యమం చేపడుతుంటే ప్రభుత్వ పెద్దలకు వారితో చర్చించకుండా, అధికార మదంతో సచివాలయ సిబ్బందిని అడ్డుపెట్టుకొని అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలు కొట్టే ప్రయత్నాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, అంగన్వాడీలు చాలీచాలని జీతలతో, మరోపక్క నిత్యవసర వస్తువులు ధరలు, కూరగాయల, గ్యాస్ తదితర బిల్లులు వారి నెత్తిన నెడుతూ ఆ బిల్లులను ఆరునెల్లుకో మూడు నెలలకు వేస్తూ వారిని తీవ్రంగా మానసికంగా వేధించడమేమన్నారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించకుండా అటు కనీస వేతనం ఇవ్వకుండా వారి జీవన విధానం వర్ణదానతీతంగా ఇంకెన్నాళ్లు గడుపుతారని విమర్శించారు. కావున అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం చర్చల ద్వారా మానవతా దృక్పథంతో నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షాన రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏర్పడే ప్రజా ప్రభుత్వం ద్వారా వీరి సమస్యలన్నీ పరిష్కరిస్తామని అంగన్వాడీలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పామిడి మండల జనసేన వీర మహిళలు, నాయకులు, నిస్వార్థ జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.