జగ్గయ్యపేట ( జనస్వరం ) : మిగ్ జాం తూఫాన్ కారణం గా నష్టపోయిన మిర్చి రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాడిశ మురళీకృష్ణ పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తుఫాను కారణంగా ఇప్పటికే మిర్చి రైతుకు సగానికి సగం నష్టం వచ్చిందని పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రకృత్తి విపత్తులు చీడపీడలు వల్ల పంట నష్టపోయినప్పుడు పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని గొప్పలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి రైతులను నిలువునా ముంచిందని అన్నారు. తక్షణమే పంట నష్టాన్ని ప్రాథమిక అంచనా వేసి నష్టపోయిన ప్రతి మిర్చి రైతును ప్రభుత్వం ఎకరానికి యాబైవేల రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.