బాపట్ల ( జనస్వరం ) : బాపట్ల జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన్ ఆదిశేషు మాట్లాడుతూ పట్టణంలోనే శృంగారపురములోని ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి కాపు కళ్యాణ మండపం వెళ్లే రోడ్లు వరుకు పక్కన ఉన్న మురుగు కాలవ మరియు పరిసర ప్రాంతాలు తుక్కు వ్యర్ధాలు నిండి దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు. దోమలతో పందులతో అంటూ రోగాలతో స్థానిక రోజులు ఇబ్బందులపాలు అవుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. మీరు ఇలాంటి ప్రాంతాల్లో నివాసం ఉండగలరా ? బాపట్ల మున్సిపల్ కమిషనర్ చెత్త పొన్ను నీటి పొన్ను కట్టించుకోవటానికి ప్రజల్ని వేధిస్తూ ఉన్నాడు. ప్రజల ఆరోగ్యాలు ఎలాగో పట్టించుకోని కమిషనర్ బాపట్ల పట్టణంలో రాజకీయ నాయకులకు ప్రజల ఓట్లు అయితే కావాలి కానీ, ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోరని అన్నారు. జిల్లా అభివృద్ధి అని బాపట్ల మురికివాడ చేస్తూ ప్రజలను దోసుకొని దాసుకుంటున్న ఎమ్మెల్యే కోన రఘుపతి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెత్తను తీసివేయాలని కోరారు. కాలవల్లో ఉన్న చెత్తను తీసివేయాలని కాలవల్లో మురుగును తొలగించాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే కోన రఘుపతిని డిమాండ్ చేశారు.