ప్రకాశం ( జనస్వరం ) : స్థానిక నాయకులు నరసింహారావు, రాజేంద్ర, సిద్దవరపు రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా జనచైతన్య యాత్ర 59వ రోజు ఒంగోలులోని 9వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీ లో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు తో మాట్లాడుతూ కనీసం పెన్షనర్లకు కూడా సకాలంలో పెన్షన్లు అందించలేని ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం, రిటైర్డ్ అయ్యి పెన్షన్ల మీదే బతికే మాకు చాలా ఇబ్బందిగా తయారయిందన్నారు. అలానే కొందరు మాట్లాడుతూ ఉపాధి లేక నాన ఇబ్బందులు పడుతున్నామని, బతకటం కూడా ఇబ్బందిగా తయారైందని అన్నారు. అలానే ఎన్టీఆర్ కాలనీ చివరి ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా ఉందని ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు అనీ అన్నారు. అలానే డ్రైనేజీ సమస్య, కాలనీలో చాలా చోట్ల కాలువలు కూడా లేవు అనీ స్థానికులు జన చైతన్య యాత్ర బృందం దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, మరియు వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ మరియు జనసేన నాయకులు చెన్ను నరేష్, తాటిపత్రి జాన్, యాదల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.