నెల్లూరు ( జనస్వరం ) : రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ, తెలుగుదేశం కలిసి పనిచేయాల్సింది ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా కూడా వారిని గెలిపించే దిశగా ప్రయాణించాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపునిచ్చారు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పొంగూరు నారాయణ గారి సతీమణి రమాదేవి ముఖ్య అతిథిగా నెల్లూరు నగరం కింగ్స్ కోర్ట్,ఎగ్జాటికా గార్డెన్స్ నందు మహిళా చైతన్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికగా పలువురు మహిళలు వారి మనోభావాన్ని పంచుకొని నెల్లూరు నగరభివృద్ధికి స్వచ్ఛంద మద్దతు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో రమాదేవి గారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నిజాయితీ కి మారుపేరు పవన్ కళ్యాణ్ గారు అవినీతిని రూపుమాపేందుకు రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేయడం నిజంగా శుభపరిణామం. స్వయంకృషి కి మారుపేరు నారాయణ, మంత్రిగా నెల్లూరులో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో అధికారం మారడం వల్ల అభివృద్ధి పనులు సగంలో ఆగిపోయినవి.వాటన్నింటిని కూడా పునరుద్దరిస్తాం. నెల్లూరు నగరాన్ని సర్వాంగ సుందరంగా రూపొందించేందుకు మీ అందరి మద్దతు అవసరమని కోరారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యలు తెచ్చేందుకు శ్రమిస్తామని తెలిపారు.వచ్చిన మహిళలు ఓటు వేయడమే కాకుండా అభివృద్ధి కి ఓటు వేసే విధంగా మోటివేట్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం…అభ్యర్థులు ఎవరైనా ఉమ్మడి గెలుపు కి జనసేన పార్టీ శ్రేణులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన దశాబ్ద కాలం గా మహిళా సాధికారత,వారికి రాజ్యాధికారం రావాలని.ఒక సంసారాన్ని ఆదాయం ఎంత ఉన్నా ఒక నిర్మాణాత్మకంగా చేయడంలో స్త్రీల పాత్ర ఎంత ఉందో… అదే విధంగా రాజకీయాల్లో కూడా స్త్రీలు రాణించాలని, సభ్య సమాజ నిర్మాణానికి మహిళలు కూడా రాజకీయాల్లో నిలబడాలని కోరుకున్నట్లుగానే.. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 33% రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించింది. నెల్లూరు నగరంలో అభివృద్ధి కి మారుపేరు నారాయణ గారు స్వయంకృషి తో పైకి వచ్చి అనేకమంది మార్గదర్శకంగా నిలిచారు. విద్యా వైద్యరంగంలో ఆయన ఎనలేని సేవలు చేస్తున్న మాజీ మంత్రివర్యులు,నగర పట్టణ అధ్యక్షులు నారాయణ గారి సతీమణి ప్రజలతో మమేకం అవుతూ అవినీతి రహిత సమాజం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని కోరటం ఎంతగానో నచ్చింది. అందుకే బంధుమిత్రుల తో వీర మహిళలతో ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేసి మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకతను, ప్రజా ప్రభుత్వానికి అవసరమైన మద్దతును కోరడం జరిగింది. నైపుణ్యం కలిగిన నెల్లూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు అందరం సమిష్టి కృషిచేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారూ. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రమాదేవి గారితో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, వారి సతీమణి విజయలక్ష్మితో జనసేన పార్టీ వీరమహిళ నాయకురాలు కోలా విజయలక్ష్మి, రేణుక, ఉమాదేవి, హైమావతి, కృష్ణవేణి, కవితా, శ్యామల, సునీత తదితర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.