సర్వేపల్లి ( జనస్వరం ) : మిచాంగ్ తుఫాన్ కారణంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఇడిమేపల్లి పంచాయతీలోని పలుకూరివారి పాలెం చెరువు కట్టను సోమవారం పరిశీలించిన సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా అనేక చెరువుల కట్టలు అస్తవ్యస్తంగా మారి, గండ్లు పడే విధంగా తయారయ్యాయి. కానీ ఇప్పటివరకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవు. ఏదైతే వెంకటాచలం మండలంలోని పలుకూరివారి పాలెం చెరువు ఆయకట్టు కింద నాలుగు వేల ఎకరాలు సాగు భూమి వుంది. అదేవిధంగా చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించే చెరువు. అలాంటి చెరువు కట్ట మునుకకు గురై బాగా దెబ్బ తినేస్తుంది. ఇంకా కాలు భాగం మాత్రమే ఉంది. ఇకనైనా ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు చెరువు కట్టని పరిశీలించి మరమ్మత్తులు చేయండి. చెరువు అని రీమిటింగ్ వాళ్ళతో ప్రతిష్ట పరచాలని, జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం. ఈ చెరువు పటిష్టపడితే రెండు పంటలు పండించుకునే దానికి సాగునీరున్నది అందించే విధంగా తయారవుతుంది కానీ ఇప్పటివరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాన్ని గోవర్ధన్ రెడ్డి పరిశీలించడం గాని ఆయన రెండుసార్లు గెలిచి కనీసం ఆ చెరువుని అభివృద్ధి చేసి దిగువ నున్న రైతులకు రెండు పంటలకు సాగు నీరు అందిoచడానికి ప్రయత్నం జరగలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అయ్యుండి ఒక సర్వేపల్లి నియోజకవర్గం లోని రైతులని కాపాడాలి. చెరువులను పటిష్ట పరచలి. వరద నీరు వర్షపు నీరు వచ్చినప్పుడు దా కాకుండా భద్రపరచుకొని రైతులకి పుష్కలంగా నీరు అందించాలి అనే ఆలోచన లేకుండా కనీసం గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలని అడిగి సమస్యలు తెలుసుకోవడం గాని, గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆలోచన గానీ, రైతులను ఆదుకోవాలని ఎక్కడ వ్యక్తపరచని మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరమా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలారా ఇకనైనా కళ్ళు తెరవండి 2024లో జనసేన తెలుగుదేశం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. సర్వేపల్లి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. మాటల గారడీ చేసే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎవరు నమ్మొద్దు. ఈ కార్యక్రమంలో వీర మహిళ గుమినేని వాణి భవాని మండల కార్యదర్శి శ్రీహరి, స్థానికులు చెంచయ్య, రామిరెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.