వైసిపి అరాచక పాలన నుండి విముక్తి కావాలి

  గంగాధర్ నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు మండలం, వింజం పంచాయితీ, ఆవలాపూర్ గ్రామంలో జనం కోసం జనసేన ( భవిష్యత్తు గ్యారెంటీ ) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటి ఇంటిని దర్శించి కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా స్రవంతి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఆహ్వానిస్తున్నారని ఉద్ఘాటించారు. వైసిపి అరాచక పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఇద్దరు సమర్థవంతమైన నాయకులతోనే ఈ రాష్ట్రానికి క్షేమాభివృద్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు అందిస్తున్న సంక్షేమ పథకాలే కాకుండా మరికొన్ని అద్భుతమైన సంక్షేమ పథకాలు అందించటానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి మనవి చేస్తున్నానని, సరి కొత్త ప్రజా ప్రభుత్వానికి చేయూతనివ్వండి, జనసేన తెలుగుదేశం పార్టీలకు ఒక అవకాశం ఇవ్వండిని విజ్ఞప్తి చేశారు. మైనారిటీలకు పెద్ద పీఠం వేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గంగాధర్ నెల్లూరు మండలంలో ఉన్న 32 గ్రామపంచాయతీలోని 32 గ్రామాలను మొదటి సంవత్సరంలోనే ఆదర్శవంతమైన గ్రామాలుగా రూపొందిస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరు మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు రషీద్, మాజీ సర్పంచ్ బాలకృష్ణ రెడ్డి, వింజం పంచాయితీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సతీష్, గంగాధర్ నెల్లూరు మండల బూత్ కన్వీనర్ తులసి కుమార్, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ యువజన కార్యదర్శి కోదండన్, గంగాధర్ నగర్ మండల ఉపాధ్యక్షులు రాము తెలుగుదేశం పార్టీ నాయకులు జమీర్, రియాజ్, షార్ జన సైనికులు ముజ్విల్, జాకృసేన్, లాలు భాషా, నజీర్, అజ్మీర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way