సిధ్ధవటం ( జనస్వరం ) : లింగంపల్లి ప్రధాన రహదారి రోడ్ల పరిస్థితి పై మండల జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లాలో రోడ్లు అభివృద్ధి శూన్యమని పవన్ కళ్యాణ్ పై విమర్శించడం మానుకొని పరిపాలన చేయాలని మా పార్టీ పొత్తులపై విమర్శించడం మానుకొని గ్రామాల్లో అభివృద్ధి చేయాలని శనివారం లింగంపల్లి గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది. రాజంపేట జనసేన నాయకులు బాల సాయి, సిద్ధవటం జనసేన పార్టీ వార్డు మెంబర్ పసుపులేటి కళ్యాణ్, జనసేన పార్టీ ఆవుల రాజా, అతికారి, అయ్య వారయ్య, దుగ్గి సుబ్బయ్య, వెంకట్, తదితరులు పాల్గొన్నారు. లింగంపల్లి గ్రామంలో రోడ్లు అద్మానంపై శనివారం వారు మాట్లాడుతూ లింగంపల్లి గ్రామం నందు రహదారి సరిగా లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారని అన్నారు. వర్షపు నీరు నిల్వ వల్ల దోమలు విపరీతంగా ఉన్నాయని సీఎం సొంత జిల్లాలో రోడ్ల పరిస్థితి చూస్తూ అంటే రాష్ట్రంలో ఎలా ఉంటాయో అర్థమవుతుందని అన్నారు. వైసీపీ వారు పవన్ కళ్యాణ్ విమర్శించడం మాని అభివృద్ధిపై శ్రద్ధ చూపాలని మా పొత్తులపై మాట్లాడే శ్రద్ధ గ్రామ పంచాయతీలో అభివృద్ధి చేయాలని లింగంపల్లిలో వైసిపి వారు పర్యటించాలని ప్రజా ఆగ్రహం తప్పదని అన్నారు. జనసేన పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బటన్ నొక్కడంపై ఉన్న ప్రేమ గ్రామ పంచాయతీలపై చూపించాలని తెలియజేశారు. ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం అంటూ పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ గ్రామస్తులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.