శ్రీకాళహస్తి ( జనస్వరం ) : ఈ నెల డిసెంబర్ 9 న కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చివరి రోజు గడువు కావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారు రేణిగుంట పట్టణం బస్టాండ్ వద్ద క్యాంప్ నిర్వహించారు. విద్యార్థులు, అర్హత ఉన్న ప్రజలకి ఓటరు నమోదు పై అవగాహన కల్పించి జనసేన పార్టీ ఐటీ సభ్యుల ద్వారా ఓటు లేని వారికి ఓటరు నమోదు చేయించడం జరిగింది. అలాగే ప్రజలకి తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల తలరాతలు నిర్దేశిస్తుందని, ఓటు విలువ అందరూ గ్రహించాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 9 వ తేదీ లోపు ఓట్లు నమోదు చేసుకోవాలని కోరారు. మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని, అలాగే ఓటరు లిస్టులో దొంగ ఓట్లు ఉన్నట్లైతే అభ్యతరాలు తెలపాలని, గ్రామ, వార్డు స్థాయిలో జనసేన నాయకులు, జనసైనికులు పరిశీలించి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, చిన్నతోట నాగరాజు, నాయకులు త్యాగరాజు, శ్రీనివాసులు, నాథ ముని, పార్థ సారథి, గంగ, ఉమా మహేశ్వరి, అనురాధ, జయలలిత, భాస్కర్ బాబు, జగదీష్, పేట చంద్ర శేఖర్, జ్యోతి రామ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.