ఎమ్మిగనూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో 67 వ అంబేద్కర్ వర్ధంతి వేడుకల్ని నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు కాసా రవి ప్రకాష్, కర్ణం రవి, రాహుల్ సాగర్, బజారి మాట్లాడుతూ ఆస్తమించని సూర్యుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్.బి.ఆర్. అంబేద్కర్ గారని భారతదేశం కోసం బడుగు బలహీన వర్గాల కోసం చాలా కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హక్కులనేతని ఓటు హక్కు ద్వారా దేశంలో రాజకీయ సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తి అని ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి పౌరునికి జీవితాన్ని ఇస్తుందని, న్యాయ శాస్త్ర మంత్రిగా ఉంటూ స్త్రీలకు హక్కులకై పోరాడిన వ్యక్తి అన్నారు. అన్నివర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలురాజ్యాంగం లో చేర్చి రాజ్యాంగ పితగా పేరుపొందాడని అన్నారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్ పరశురాం నరేష్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.