గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండలం, జనసేన పార్టీ ఇంచార్జి డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం కారు వేటినగరం మండల కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఇద్దరూ కారణజన్మలని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే ఉద్భవించిన ఉత్తమ నాయకులని ఉద్ఘటించారు. అస్తవ్యస్తంగా, సంపద లేక, అభివృద్ధి లేక, అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునరజ్జీవనం కల్పించడానికి జనసేన, తెలుగుదేశం పొత్తు చారిత్రాత్మకమని తెలియజేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు తీసుకునే సమయోచితమైన నిర్ణయం ఏదైనా, దానికి జనసేన కట్టుబడి ఉంటుందని, జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఉపయోగపడని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని ఓడించడమే మా ద్యేయమని తెలిపారు. ఓటుకి నోటు ఇవ్వకుండా గెలిచే సత్తా నారాయణస్వామికి ఉందా అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాపులంతా పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటారు, జనసేన,తెలుగుదేశం కలిసి సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తెలియజేశారు. నీకు సీటు రాదన్న బెంగతో, పవన్ కళ్యాణ్, చంద్రబాబులను విమర్శిస్తే ముఖ్యమంత్రి ఈసారి జరిగే ఎన్నికల్లో టికెట్ ఇస్తారనే భ్రమలో ఉన్నావని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడించి ఈ నియోజకవర్గం లో సర్వతో ముఖాభివృద్ధిని సాధిస్తామని తెలిపారు. నువ్వు చేయలేని అభివృద్ధిని మేము చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మిచాంగ్ తుఫాను ప్రభావం ఎక్కువ ఉన్నందువల్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జనసేన పార్టీ ఆరు మండలాల అధ్యక్షులు మీకు అందుబాటులో ఉంటారని, ప్రతి గ్రామంలో జనసైనికులు కూడా మీకు సహాయ సహకారాలు అందించటానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నరేష్, గంగాధర్ నెల్లూరు మండల బూత్ కన్వీనర్ తులసి కుమార్, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షురాలు సెల్వి, కార్వేటినగరం టౌన్ కమిటీ ప్రెసిడెంట్ రాజేష్, వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, కార్వేటినగరం మండల కార్యదర్శి మురళి పాల్గొన్నారు.