సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ తోటపల్లిగూడూరు మండల అధ్యక్షులు సందీప్, సీనియర్ నాయకులు శరత్, రవి సమక్షంలో తోటపల్లి గూడూరు మండలం పేడూరు, ఆములూరు, పాపిరెడ్డిపాలెం, నరుకూరు గ్రామాల నుంచి 70 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమిష్టిగా కృషి చేయాలి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మెగా అభిమానులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా కలిసి పని చేయాలి. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రజా ప్రభుత్వంతో సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ అభ్యున్నతికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కలిసి కృషి చేయాలి. జనసేన పార్టీ రాష్ట్ర పెద్దలు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు మనుక్రాంత్ రెడ్డి గారి ఆదేశాలతో త్వరలోనే గ్రామాలలో వార్డు, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వ స్థాపన కృషి చేయాలి. కార్యక్రమంలో కోటపల్లి గూడూరు మండల నాయకులు కోసూరు నారాయణ, పేడూరు పంచాయతీకి సునీల్, వినోద్, వినయ్, శరత్, పాపిరెడ్డిపాలెం, లక్ష్మీనారాయణ, జయసుధ, రమణయ్య, వెంకటరమణయ్య, ఆములూరు పంచాయతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.