అనంతపురం ( జనస్వరం ) : నగరంలోని స్థానిక విములాఫరూక్ నగర్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాఏర్పాటు చేయకూడదని వామపక్షాలైన జనసేన-టీడీపీ పార్టీల, భారత కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన-తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మాట్లాడుతూ అర్ధరాత్రి దొంగలు తిరిగే సమయంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం కూడా జనసేన-తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేఖించం. పర్మిషన్ తీసుకోని మాజీ ముఖ్యమంత్రిని అవమాన పరచకుండా సక్రమంగా విగ్రహాన్ని పెట్టాలన్నారు. చనిపోయిన వ్యక్తికి ఆత్మ శాంతి క్షోభించే విధంగా ఈ రాష్ట్రములో వైస్సార్ నాయకులు అవలంబిస్తున్నారు. అనంతపురము నగరంలోని ప్రధాన రోడ్డు సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు అనేక కూడల్లిలో ఉండే చాలా మంది మహనీయుల విగ్రహాలని దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు. నేటికీ ఆ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయలేదు. గతంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఫెర్రర్ విగ్రహన్ని తొలగిస్తే ఒక్క వైస్సార్సీపీ పార్టీ తప్ప ప్రజాసంఘాలు, అఖిలపక్ష పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తే కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఫెర్రర్ విగ్రహాన్ని పెట్టారన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పాలన ఈ రాష్టంలో నేటికీ కొనసాగుతోందన్నారు. అభివృద్ధి, ప్రజాసమస్యలను పట్టించుకోరు. కానీ చనిపోయిన మహనీయుల విగ్రహాలను దొంగచాటున దొడ్డిదారిలో పెట్టడానికి వైస్సార్సీపీ ప్రభుత్వం పునుకుంటోంది. రాష్టంలో వైస్సార్సీపీ విలువలు, ఉనికిని కోల్పోయారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వాడుకొని ఎన్నికలలో గెలచి అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు. అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గారిని కలుస్తామన్నారు. అక్రమంగా పెట్టిన విగ్రహాన్ని తొలగించాలి. సక్రమైన మార్గంలో పర్మిషన్లు తెచ్చుకొని మరిన్ని మహనీయుల విగ్రహాలని పెట్టి ప్రజలకు ఆదర్శంగా ముందుకు పోవాలి. కానీ దుర్మార్గమైన చర్యలు రాష్ట్రములో ఈ జిల్లాలో ముందుకెల్తోంది. కానీ ఎక్కడికక్కడ వైస్సార్ పార్టీ దుర్మార్గాన్ని అనంతపురం నగరంలో ఎండుకడతమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.