రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్

        గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గుడివాడ పట్నానికి చెందిన పల్లవి అనే గర్భిణీ స్త్రీకి శాస్త్ర చికిత్స కొరకు రక్తం అవసరం అవడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ కి తెలియజేయగా వెంటనే స్పందించి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ (RK) మాట్లాడుతూ రక్తదానం చేయండి – ప్రాణదాతలు కండి అనే పిలుపు మేరకు గుడివాడ పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అనేకసార్లు రక్తదానం చేసి ప్రజలకు తోడుగా ఉంటున్నామని ఈరోజు గుడివాడ పట్టణానికి చెందిన పల్లవి అనే గర్భిణీ స్త్రీ కు శాస్త్ర చికిత్స నిమిత్తం అత్యవసరంగా రక్తం అవసరం అవడంతో మమ్మల్ని సంప్రదించగా వెంటనే రక్తదానం చేసి ఆ తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడడం జరిగిందని తెలియజేశారు. అదే విధంగా చాలామంది యువత రక్తం ఇవ్వాలంటే లేనిపోని అపోహాలు మనసులో పెట్టుకుని రక్తం ఇవ్వడానికి ముందుకు రావట్లేదని అవేమీ మనసులో పెట్టుకోకుండా రక్తదానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మణిస్తారని తెలిపారు. దయచేసి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. మేము అడిగిన వెంటనే స్పందించిన సిద్దుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో నూనె అయ్యప్ప, మట్ట జగదీష్, చరణ్ తేజ్, దివిలి సురేష్, గంట అంజి, మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way