సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు బీచ్ కి వెళ్లే రోడ్డుపై ఉన్న గుంటలను పూడ్చాలని జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి ఆదివారం ఉమ్మడిగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ తోటపల్లిగూడూరు మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తకోడూరు బీచ్ కి వెళ్లే రోడ్డుపై ఏర్పడిన గుంటలను పూడ్చాలని నిరసన తెలియజేశారు. సురేష్ నాయుడు మాట్లాడుతూ పర్యాటకంగా దినదిన అభివృద్ధి చెందుతున్న కొత్త కోడూరు బీచ్ నెల్లూరు నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో వుంది. కానీ బీచ్ కు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా గుంటలతో దారుణంగా తయారైంది. ఆ రోడ్డు అభివృద్ధి చేస్తే కొత్తకోడూరు బీచ్ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. పర్యాటక శాఖ మంత్రి రోజా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని కూడా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. సైకో ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల ఏడు నెలలు కావస్తుంది. ఇప్పటివరకు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందిన కొత్తకోడూరు బీచ్ కి వెళ్లే రోడ్డు కాదు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు అన్ని దారుణంగా అస్తవ్యస్తంగా తయారైన, రోడ్లపై ఏర్పడిన గుంటలను పూడ్చే పరిస్థితి కూడా సైకో ప్రభుత్వం చెయ్యకపోవడం దారుణం. నిన్నటి రోజు చూస్తే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రూ.21 కోట్లు నిధులు తీసుకొచ్చాం, సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక రోడ్లన్నీ నిర్మాణం చేయడానికి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ నాలుగు నెలల్లో రూ.21 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణం పూర్తి చేయగలరా అంటే ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి ఇదొక కొత్త డ్రామా, అందులో భాగంగానే ఈ ప్రకటన చేశారు. ప్రజలను మభ్యపెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గారు రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపిస్తే, మంత్రి ఇప్పటికీ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒకటే చెప్తు ఉన్నాం. ఇంక నాలుగు నెలలు మీ కాలపరిమితి ఈ నాలుగు నెలలు అయినా ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లపై ఉన్న గుంటలను పూడ్చండి. ఈ నాలుగు నెలల తర్వాత మీరు ఏం చేయనక్కర్లేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోంది జన సేన, తెలుగుదేశం పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రజా ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎలా చేస్తామో మీకు చూపిస్తాం. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కాపు సంక్షేమ సేన మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ గుమ్మినేని వాణి భవాని, మండల జనసేన నాయకులు శరత్, నడవల రవి, సునీల్, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, ఖాజా, తెలుగుదేశం పార్టీ కోడూరు సర్పంచి శ్రీనివాసులు, అవినాష్, ఠాగూర్ ,సౌత్ ఆములూరు మాజీ సర్పంచ్ చుక్కపల్లి మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.