•వీరనారి ఝాన్సీలక్ష్మి బాయి పోరాటస్పూర్తి మహిళాలోకానికి ఆదర్శం…
•వృత్తి విద్యలతోనే మహిళలకు ఆర్థిక భరోసా…
•ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో వృత్తి విద్యలలో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాలు అందజేత…
– జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ..
అనంతపురం ( జనస్వరం ) : ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 195వ జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ మహిళా కార్యాలయం అనంతపురం నందు రాయలసీమ రీజినల్ ఉమెన్ కో- ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ఝాన్సీరాణి చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు అనంతరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వృత్తి విద్యలలో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ధ్రువపత్రాలు అందించి ఆమె మాట్లాడుతూ దేశ ప్రజలపై తెల్లదొరల దమనకాండకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం సాగించి ఆత్మార్పణం చేసిన దిశాలి ఝాన్సీ రాణి అని తెలుపుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మహిళా విభాగానికి ఆమె పేరు మీదనే వీర మహిళ విభాగమని నామకరణం చేసి ఆమె సేవలు ప్రస్తుత తరాల వారికి కూడా తెలియజేశారన్నారు అలాగే వృత్తి విద్యలో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాలు అందించి వృత్తి విద్యలతోనే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వారే నిలబడి కుటుంబానికి భరోసాగ ఉండగలరని తెలియజేస్తూ మనమందరం ఝాన్సీ రాణి స్ఫూర్తితో పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర కార్యదర్శి జక్కిరెడ్డి పద్మావతి, శిక్షకురాలు గురులక్ష్మి వీర మహిళలు శైలజ, శశిరేఖ, యమున, జయంతి, వెంకటలక్ష్మి, గాయత్రి తెలుగు మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.