పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం జనసేన, టీడీపీ ఆత్మీయ సమావేశ౦ పత్తికొండలో టిడిపి ఆఫీసులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం నిర్వహణ బాధ్యులు సిజి రాజశేఖర్ మరియు పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్యాం కుమార్ గారు మాట్లాడుతూ భవిష్యత్తు ఉమ్మడి కార్యాచరణకు మనవంతు కృషి చేద్దామని అన్నారు. కలిసికట్టుగా మన గళాన్ని, మన ప్రత్యేకతను చాటుద్దాం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం, అదేవిధంగా మండల స్థాయి గ్రామస్థాయి మీటింగులు కూడా అతి త్వరలో నిర్వహించి ఉమ్మడి ప్రణాళికల ప్రకారం 2024లో పత్తికొండ నియోజకవర్గంలో జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించడం కోసం, కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేశారు. అదేవిధంగా జనసేన టిడిపి కార్యకర్తలకు మేము ఎప్పుడూ అండదండగా ఉంటామని ఏ కష్టం వచ్చినా ఎవరైనా ఇబ్బందులు పెడితే ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటామని తెలియజేశారు. వైసిపి ప్రభుత్వాన్ని 2024లో ఆంధ్ర రాష్ట్రం నుండి విముక్తి కల్పించడానికి జనసేన పార్టీ టిడిపి పార్టీ ఏకమయ్యాయని ఈసారి ఎట్టి పరిస్థితిలో పత్తికొండ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని తీరుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివరెడ్డి బీసీ సెల్ అధ్యక్షుడు రామనాయుడు, టిడిపి ముఖ్య నాయకులు, పాల్గొన్నారు మరియు జనసేన పార్టీ నాయకులు, గోవిందు, క్రాంతి కుమార్, నాయికల్ బాబ్జి, ఇస్మాయిల్, నూర్ భాషా, ఆర్కే నాయుడు, నరేష్, మధు నాయుడు, నాగేశ్వరరావు, పులి శేఖర్, ఎర్రి స్వామి, వడ్డే విరేష్, మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.