అర్హులైన వారికి పెన్షన్ ఎక్కడా ? సొంతిల్లు ఎప్పటికో ?

      కాకినాడ రూరల్ ( జనస్వరం ) : నియోజకవర్గంలోని కరప మండలం గురజనాపల్లి గ్రామం లో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి 13వ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు అక్కడి ఇబ్బందులను వివరించారు. వృద్ధులు అని చూడకుండా, ఆధారం లేని మహిళలకు పెన్షన్లు ఇవ్వకుండా ఉన్న పెన్షన్లు కూడా తీసేసి ఇబ్బంది పెడుతున్నారు. పట్టాలు వచ్చాయి కానీ లబ్దీదారుడు ఇల్లు కట్టుకోవడానికి స్థలమే లేకుండా చేశారు. ఈ వైసిపి ప్రభుత్వం అంతం అయ్యేరోజు త్వరలోనే ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే జనసేన, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way