పాలకుర్తి ( జనస్వరం ) : పాలకుర్తి నియోజకవర్గంలో జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డి గారి ఆహ్వాన మేరకు జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు (పాలకుర్తి నియోజకవర్గం) మేడిద ప్రశాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలియజేసారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలతో పాలకుర్తి నియోజకవర్గం జనసైనికుల తరఫున బిజెపి ఉమ్మడి అభ్యర్థి రామ్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ పొత్తు ధర్మం పాటించాల్సిందిగా కోరడం జరిగింది. నియోజకవర్గం భవిష్యత్ కార్యాచరణపై జనసేన ఎలక్షన్ కమిటీ సభ్యులతో కలిసి చర్చించి అనంతరం ఉమ్మడి కార్యాచరణతో నియోజకవర్గంలో జనసేన బిజెపి పార్టీ ఉమ్మడి అభ్యర్థి లేగ రామ్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, పెరుమండ్ల యాక స్వామి, గంట మహేష్, మాడరాజు అశోక్, అజ్మీర DR దేవేందర్ నాయక్, గుగులోత్ పవన్ కళ్యాణ్, మహేష్, నవీన్, కుమార్ తదుపరిలు పాల్గొన్నారు.