* వైసిపి బస్సు యాత్రకు అడ్డుగా ఉన్నాయని చెట్లు తొలగిస్తారా…?
* చెట్లు తొలగింపుకు రెవెన్యూ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా…?
*అసలు ఏ అధికారంతో చెట్లు తొలగించారు…?
పార్వతీపురం, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయుకులు రాజాన బాలు, బొనేల గోవిందమ్మ ఆధ్వర్యంలో మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, జనసేన పార్టీ బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, పార్వతీపురం మండల అధ్యక్షులు అగూరు మణి సమక్షంలో పార్వతీపురం మెయిన్ రోడ్డు లో చెట్లు తొలగింపు ఫై మున్సిపల్ మేనేజర్ ను నిలదీయడం జరిగింది. ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తారా…? అంటూ జనసేనపార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మున్సిపల్ మేనేజర్ ని ప్రశ్నించారు. శుక్రవారం జన సైనికులతో కలిసి ఆయన మున్సిపల్ కార్యాలయం వద్ద మెయిన్ రోడ్ లో చెట్లు తొలగింపుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మేనేజర్ తో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పట్టణ మెయిన్ రోడ్ లో పెరిగిన చెట్లను ఏ అధికారంతో తొలగించారన్నారు. అధికార పార్టీ బస్సు యాత్రకు అడ్డంగా ఉన్నాయని చెట్లను తొలగిస్తారా…? అన్నారు. చెట్లు తొలగింపుకు ఫారెస్ట్, రెవెన్యూ అనుమతులు తీసుకున్నారా…? కౌన్సిల్ తీర్మానాలు చేశారా…? అని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్, తాగునీరు, శానిటేషన్, రోడ్లు, కాలువలు తదితర సమస్యలను పక్కనపెట్టి పచ్చగా ఉన్న చెట్లను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఆ సమస్యలు కనబడలేదా…? అని ప్రశ్నించారు. ఆయా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు మేనేజర్ నీళ్లు నమలడంతో ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం మానుకోవాల న్నారు. మరి కొద్ది రోజుల్లో అధికారం మారనుందని అప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. అనంతరం ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. దానికి సమాధానాలు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం నల్ల బెలూన్లు ఎగురువేసేందుకు ప్రయత్నించుగా సిఐ కృష్ణారావు, ఎస్ఐ నారాయణరావు తదితరులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి చిట్లు గణేష్,జనసేన పార్టీ నాయకులు గుండ్రెడ్డి గౌరీ శంకర్, కర్రి మణికంఠ ,పోతల శివశంకర్ తామరకండీ తేజ, అంబటి బలరాం, తిరుమల రెడ్డి కనకరాజు, బోన్నాడ గణేష్ తదితరులు పాల్గొన్నారు.