గూడూరు, (జనస్వరం) : గూడూరు పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలో కొన్ని ప్రాంతాలలో మునిసిపల్ తాగునీరు రాక ప్రజలు అవస్థలు పడుతున్నారని, తాగు నీరు రాని ప్రాంతాల్లో వాటర్ టాంకర్ల ద్వారా మంచినీరు పంపిణి చేయాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా క్రోనో కార్పస్ మొక్కలు పర్యావరణానికి ముప్పు కలిగిస్తాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రకటించి ఉండడంతో గూడూరు మున్సిపాలిటీ పరిధిలో డివైడర్లు మీద ఏర్పాటు చేసి ఉన్న క్రోనో కార్పస్ మొక్కలు వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. అలాగే దోమల నివారణకు ఫ్యాగింగ్, ఆయిల్ బాల్స్, స్ప్రై చేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు యనమల విజయ్ కార్యదర్సులు మట్టిపాటి సనత్, పునగటి అవినాష్, శివ, శ్రీనాథ్, నాయకులు పాల్గొన్నారు.