జగ్గంపేట ( జనస్వరం ) : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఎండిపోవడంతో తీవ్రమైన బాధను అనుభవిస్తున్న రైతన్నలను చూసి తట్టుకోలేక వారికి ఎలాగైనా సరే న్యాయం జరిగేలా చెయ్యాలని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కంకణం కట్టుకున్నారు. కష్టతరమైనా కానీ రైతన్నల తరపున పోరాటం చేయడం కోసం 9 రోజులుగా చేసిన ఆమరణ నిరాహార దీక్షకు వెన్ను దన్నుగా నిలిచారు. జిల్లా కలెక్టరు గారితో మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ యంత్రాంగం కదిలేలా చేసి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చేలా పోరాడారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్, మరో పిఎసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, పెద్దాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తుమ్మల రామస్వామి(బాబు), ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు, కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, జిల్లా కార్యదర్సులు తలాటం సత్య, నల్లల రామకృష్ణ, జనసేన నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పంట నష్ట పోయిన ప్రతి రైతుకూ నష్టపరిహారం రావడానికి సహకరిస్తున్న పెద్దాపురం ఆర్డీఓ, మరియు రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, Dsp, పోలీసు, వైద్య సిబ్బంది, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమరణ నిరాహార దీక్ష విజయవంతం కావడానికి నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, రాత్రి-పగలు అనే తేడా లేకుండా, నిద్రాహారాలు కరువైనా పట్టించుకోకుండా నా వెన్నంటే ఉన్న మా జనసైనికులకు, వీర మహిళలకు, రైతన్నలకు, మీ పోరాటంలో మేము సైతం అంటూ సహకరించిన ఇతర పార్టీ నాయకులకు, మా ఆరోగ్యం బాగుండాలని, రైతులకు న్యాయం జరగాలని వచ్చిన అందరు మహానుభావులకు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.