నెల్లూరు ( జనస్వరం ) : రోడ్లా జారుడు బండ్లా..! ఒక్కటంటే ఒక్క పనైనా పూర్తి చేసారా..? అంటూ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కోవూరు మండలం, పాటూరు గ్రామ జనసేన నాయకులు మహేష్,మనోజ్ లతో పాటూరు గ్రామం,హరిజన వాడ స్థానికులతో కలిసి రోడ్డు విషయమే ఆందోళనకు దిగారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న గారు మూడు సంవత్సరాల ముందు ప్రచారం మాధ్యమాలలో తిరిగిన కరపత్రం ఇది. దాదాపుగా 5 మండలాల్లో 35 రోడ్లు వేస్తామని ఆ రోజుల్లో ఈ కరపత్రం తెగ తిరిగింది.ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా పూర్తి కాలేదు. పెత్తందారులకు డబ్బులు అవసరం అయినప్పుడల్లా ఏదో ఒక ప్రకటన విడుదల చేయడం నిధులు దుర్వినియోగ పరచడం జరుగుతూనే ఉంది. ఎంపీ నిధులతో ఐదు లక్షలు కేటాయించుకున్న ఈ నిధులు ఏమయ్యాయో తెలపాలి. అదే విధంగా పాటూరు కలుజు రెండు లక్షల రూపాయలతో మరమత్తులు చేస్తున్నామంటూ మీడియాలో వచ్చింది. కాస్త ఇది మట్టి చల్లి ఊరుకున్నారు కలుజు పరిస్థితి యధావిదే.. చినుకు పడితే యల్లాయపాలెం పోయే రూట్ లో మోకాళ్ళ లోతు నీళ్లలో ప్రజల అవస్థలు పడుతున్నారు. దాదాపు కోవూరు నియోజకవర్గం గ్రామాల పరిస్థితి అంతా ఇదేవిధంగా ఉంది.. మీరు ప్రకటించిన కింది వాటిలో ఏ ఒక్క పని కూడా పూర్తి చేయలేదు,గడపగడపకు వచ్చి మీ ఓట్లు వేయండని ఎలా అడుగుతున్నారు. గ్రామ నిధులు మళ్లించి అభివృద్ధిని కుంటు పరిచారు. ఈ ఒక్క గ్రామంలో కాదు రాష్ట్రం లో దాదాపు ప్రతి గ్రామంలో కూడన ఇదే పరిస్థితి… పక్క రాష్ట్రాల వారందరూ రోడ్లను హేళన చేస్తున్నారు..పాటూరు గ్రామంలో చూసినట్లయితే ఎంపీ నిధుల నుంచి అత్యవసరంగా నిధులు విడుదల చేసి రోడ్లు వేయమన్నా కూడా ఒక అడుగు పని కూడా పూర్తి కాలేదు. ఇదే గ్రామంలో గతంలో వరదలు వచ్చినప్పుడు చెరువుని అప్పలంగా వైసీపీ పెత్తందారులు వేలం లేకుండా పదివేలు ఎమ్మార్వో ఆఫీస్ లో కట్టి వచ్చిన లక్షల ఆదాయాన్ని ఎత్తుకున్నారు. కనీసం గ్రామంలో దోచుకుంటున్న సహజ వనరుల రెవెన్యూ ఉపయోగించి గ్రామాల అభివృద్ధి సాధిస్తే బాగుంటుంది. కోవూరు నియోజకవర్గంలో అనేక ప్రభుత్వ స్థలాలు ఖబ్జా కి గురి అవుతున్నాయి. ఒకపక్క ఇసుక గ్రావెల్ మట్టి అక్రమ దందాలు మరొక వైపు కబ్జాలతో వైసిపి పెత్తందారులు కోట్లు పడగెతున్నారు. కానీ ప్రజల్ని ఇంకా ఏమైనా అడుక్కునే పరిస్థితుల లోనే ఉంచారు. రోడ్లు,కాలువలు లేక మురుగు నీరు అంతా ఇళ్ల లోకి వచ్చి ప్రజలు విషజ్వరాల పాలవుతున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామాల నుంచి అభివృద్ధి మొదలుపెడతాం ..అభివృద్ది జనసేన పార్టీ తోనే సాధ్యం. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, సుధీర్ బద్దిపూడి, ప్రశాంత్ గౌడ్, మహేష్, మనోజ్, షాజహాన్, బన్నీ, శీను, వర, మౌనేష్, కేశవ తదితరులు పాల్గొన్నారు.