మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒక్కటి మరియు రెండో వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైసూర్ మహేష్ గారిని ఒకటో పట్టణ పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించారు. మదనపల్లి మున్సిపల్ పరిధిలోని ఒకటి రెండు వార్డులైనటువంటి బికేపల్లి అనుపగుట్ట చంద్ర కాలనీ మంజునాథ కాలనీ ఇందిరమ్మ కాలనీ లో కనీసం మూలిక సదుపాయాలైనటువంటి తాగునీటి సౌకర్యం మురుగునీటి కాలువలు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనం కోసమే జనసేన పాదయాత్రలో మహేష్ దృష్టికి ఈ సమస్యలు రావడంతో ఈ సమస్యలపై స్పందించి గత ఐదు నెలలుగా మదనపల్లె నియోజకవర్గంలోని సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ మరియు అన్ని ప్రభుత్వ విభాగా అధికారులను కలిసి సమస్యలపై ఎన్నో విధాలుగా పోరాటాలు చేయడం జరిగింది. రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు మున్సిపల్ అధికారులు స్పందించి సుమారు రెండు కోట్ల 85 లక్షలు చేసి రెండు నెలల లోపు పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. సుమారు ఐదు నెలలు కావస్తున్న ఇటువంటి పనులు జరగకపోవడంతో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒకటి రెండు వార్డుల ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకటో పట్టణ పోలీస్ అక్కడి చేరుకుని మైఫోర్స్ మహేష్ ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ ఒకటి రెండు వార్డులను సమస్యలు పరిష్కరించకపోతే ఇదే నెల 20 తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు మున్సిపల్ ఆఫీస్ ముందు దిగుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు శోభా సునీత, జనసేన పార్టీ నాయకులు ప్రవీణ్, అఫ్సర్సిమి, రమణ, లక్ష్మి, దేవేంద్ర, దాము, తదితరులు పాల్గొన్నారు.