బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, సోమదివలస గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ నాయకత్వంతో కలిసి “రైతు గర్జన” కార్యక్రమాన్ని నిర్వహించారు. వరి పంటకు సకాలంలో సాగునీరు అందకపోవడంతో ఒకే గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 2500 ఎకరాలు పైచిలుకు పంట నష్టం జరిగుంటుందని బొబ్బిలి జనసేన నియోజకవర్గం ఇంచార్జి గిరడ అప్పలస్వామి మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు గారు తెలిపారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ తెర్లాం మండల అధ్యక్షలు వెంకటనాయుడు, మాజీ ఎంపీపీ నర్సుపల్లి వెంకటేష్ మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొని వరి పంట పొలాలను పరిశీలించారు. బాబు పాలూరు మాట్లాడుతూ, బొబ్బిలి నియోజకవర్గంలో నాలుగు మండలాలలో పంట నష్టాన్ని RBK సిబ్బంది ద్వారా గుర్తించి, కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. శ్రీ గిరడ అప్పలస్వామి గారు మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ఒక రాక్షసుడిగా నియంతలా పాలిస్తున్నాడని ఎద్దేవా వేశారు. తెర్లాం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మరడాన రవి, చందక ఉమా మహేష్ మరియు వీరమహిళ యామిని మరియు తెర్లాం మండలం తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ నష్టపోయిన వరి పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, రైతు పక్షపాతి అని చెప్పుకొనే వైసీపీ ఎమ్మెల్యే, ఈ వైసీపీ ప్రభుత్వం రైతులపై శ్రద్ద చూపకపోవడం దారుణమన్నారు, వెంటనే సంబంధిత అధికారులతో దర్యాప్తు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందజేయాలన్నారు, లేని పక్ష్యంలో జనసేన టీడీపీ సమస్వయం తో భారీ ఎత్తున నిరసనలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, రామభద్రపురం మండల అధ్యక్షులు భవిరెడ్డి మహేష్, జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి మహంతి ధనుంజయ, జనసేన సీనియర్ నాయకులు లెంక రమేష్, కనకాల శ్యాం, అడబాలు నాగు, పళ్లెం రాజా, చీమల సతీష్, రాజా జగన్, తెర్లం మండల నాయకులు బూరి రామకృష్ణ, RP రాజు, అబోతుల రాజు, పాండ్రంగి అప్పారావు, ఎందువ సత్యన్నారాయణ, వీరమహిళలు రమ్య, వరలక్ష్మి, గోపి, సాయి, నవీన్, శ్రీను, సింబు, శివ, మండల శ్రీకాంత్, జన్నివలస నవీన్, రామ్ లక్ష్మణ్, రఘు, రమేష్, పెరుమాలి శ్రీను, తదితర జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.