ఓట్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరిగితే సహించేది లేదు

అక్రమాలు

      గుంటూరు ( జనస్వరం ) : ఎన్నికల కమీషన్ స్పెషన్ క్యాంపెయిన్ లో భాగంగా జరుగుతున్న ఓట్ల ప్రక్రియను ఆదివారం జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి పరిశీలించారు. 18, 22 డివిజన్లకు సంబంధించిన పోలింగ్ బూతులలో విధులు నిర్వహిస్తున్న బి‌ఎల్‌ఓ లను కలిసి ఓట్ల నమోదు, మార్పులు, చేర్పులు ఏ విధంగా జరుగుతున్నాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓట్ల నమోదులో ప్రజలకు ఉన్నటువంటి సందేహాలను తీర్చాల్చిన బాధ్యత బీయల్ ఓ లపై ఉందన్నారు. ఓట్ల ప్రక్రియలో వస్తున్న ఆరోపణల నేపధ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా బీ యల్ ఓ లు విధులు నిర్వహించాలని కోరారు. ఓట్ల జాబితా రూపకల్పనలో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదన్నారు. ఈ క్రమంలో బి‌ఎల్‌ఓ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు అధికారులు లొంగకుండా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరిలాంటి ఓట్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కోరారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన వారిలో 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ , వడ్డె సుబ్బారావు , బాలకృష్ణ , టీడీపీ నాయకులు చింతకాయల సాయి, చంద్రబాబు, మల్లి, జిలాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way