ఉరవకొండ ( జనస్వరం ) : జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తక్కువ వర్షపాతం వల్ల అప్పు చేసి సాగుచేసి పంటల దిగుబడి రాక రైతుల జీవనం ప్రశ్నార్ధకంగా మారిందని తెలిపారు. శుక్రవారం పట్టణంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి రైతుకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని,అలాగే జిల్లావ్యాప్తంగా కరువు తాండవిస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో వలసల బాట పట్టే అవకాశం ఉందని అలా జరగకుండా ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండు వందల పని దినాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.