జనసేనపార్టీకి విలువైన సేవలందిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్

జనసేనపార్టీ

       విశాఖపట్నం ( జనస్వరం ) : అంబేద్కర్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని, ప్రస్తుత కాలంలో అంతటి సిద్ధాంతాలతోను, ఆశయాలతోను రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆశయాలకోసం తన ప్రభుత్వ పదవికి త్యాగం చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో జనసైనికులను చైతన్యం చేస్తున్న గొప్ప వ్యక్తి తమ్మిరెడ్డి శివశంకర్ అని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ కి డాక్టర్ కందుల నాగరాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి పట్టిష్టతకు ఎంతో కృషి చేస్తూ జనసేన నాయకులను జనసైనికులను వీర మహిళలను స్ఫూర్తిదాయక ప్రసంగాలతో వారిలో చైతన్యం తో పాటు అవగాహన తీసుకొస్తున్న వ్యక్తి తమ్మి రెడ్డి శివశంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. తన సేవలను గూర్చి కొనియాడారు.

See also  హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దురదృష్టకరం : అల్లూరి రవీంద్ర

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి