జనసేన ఆధ్వర్యంలో చంద్రమోహన్ కు సన్మానం

     పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ జనసేన పార్టీకార్యాలయంలో… ఇటీవలే అధినేత పవన్ కళ్యాణ్  ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు  చంద్రమోహన్ గారిని రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పిసిని చంద్రమోహన్ కు సన్మాన కార్యక్రమం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పిసిని చంద్రమోహన్ గారు మాట్లాడుతూ గతంలో కాపు సామాజికవర్గానికి అన్యాయాల మీద పోరాటం చేస్తూ ఈ రోజు వరకు కొనసాగిస్తూ వస్తున్న సమయంలో, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గానికి న్యాయం చేయగల ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయనను నమ్మి , జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చానని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్  నాకు ఈ బాధ్యతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. నియోజకవర్గంలో గర్భాన సత్తిబాబు సమక్షంలో గ్రామస్థాయిలో మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటూ పవన్ కళ్యాణ్  ఆశయాన్ని సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. 

See also  క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : జనసేన నాయకులు మై ఫోర్స్ మహేష్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి