మదనపల్లి ( జనస్వరం ) : రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన జనసేన పార్టీ నాయకులు మైఫోర్స్ మహేష్ ను ఘన స్వాగతం పలికిన జనసేన పార్టీ నాయకులు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియామక పత్రం అందుకొని మదనపల్లి పట్టణమైన తిరిగి వచ్చిన జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మైఫోర్స్ మహేష్. మదనపల్లి పట్టణంలోని తట్టివారి పల్లి సర్కిల్లో చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు శంకర్ రాయల్, జలజమ్మ, రామ్మూర్తి, తంబాలపల్లి నాయకులు నాగరాజు, పీలేరు నాయకులు తలపరవి, పుంగనూరు నాయకులు చైతన్య రాయల్ ఆధ్వర్యంలో బాణాసంచాలు పేర్చి పేల్చి గజమాలతో ఘన స్వాగతం పలకడం జరిగింది. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మదనపల్లి పట్టణ వీధుల మీదుగా అంబేద్కర్ సర్కల్లోని అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి అభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం చిత్తూర్ బస్టాండ్ బెంగళూరు బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి మల్లికార్జున సర్కల్లోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర శ్రీకృష్ణదేవరాయల వారికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. నిరుగుటూరుపల్లి మీదుగా ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంజి గ్రాండ్ రెస్టారెంట్ నందు ఆత్మీయ సన్మాన సభలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నుంచి ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఇకనుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కృషి చేస్తూ ముఖ్యంగా పడమటి నియోజకవర్గం మదనపల్లి, తంబాలపల్లి, పుంగనూరు, పీలేరు, రాయచోటి, రాజంపేట నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమిని ప్రతి నియోజకవర్గంలో గెలిపించే విధంగా టిడిపి నాయకులతో సమన్వయం చేసుకుంటూ గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మహేంద్ర, రతీష్, జగదీష్, గంగాధర, ప్రవీణ్, మధు, అప్సర్, షమీ, రమణ తదితరులు పాల్గొన్నారు.