Search
Close this search box.
Search
Close this search box.

శ్రీశ్రీ కళావేదిక నిరంతర సాహితీ యజ్ఞం – ప్రతి నెలా జాతీయ శతాధిక కార్యక్రమాలు

శ్రీశ్రీ కళావేదిక

      న్యూస్ ( జనస్వరం ) : నేటి రోజుల్లో సాహిత్య కార్యక్రమాలు చేయడం అంటే మాటలు కాదు. ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఒకచోట సాహిత్య సమూహాన్ని గేధరింగ్ చేయడం అంటే సాహసమే. అది కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి 150 మంది పైబడి కవులు ఒకే వేదిక మీదకు రావడం అంటే మరీ కష్టం. అలా సాహిత్య సాహసం చేస్తున్న సంస్థ శ్రీశ్రీ కళావేదిక. ప్రతి నెలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాను ఎంచుకుని, ఒక్కో ప్రాంతంలో జాతీయ శతాధిక కవిసమ్మేళనాలు నిర్వహించడం అనేది కత్తి మీద సాము లాంటిదే. అటువంటి కలంపట్టిన, కత్తిపట్టిన వీరుడు ప్రతాప్ కత్తిమండ. అందుకే కాబోలు అందరూ ఆయన్ని మండే కత్తి, సాహిత్య చురకత్తి అంటారు. జాతీయ శతాధిక కవిసమ్మేళనాలు ఇప్పటివరకు 124 నిర్వహించిన ఘనత ప్రతాప్ కే దక్కింది. ఇప్పుడు 125 వ జాతీయ శతాధిక కవి సమ్మేళనానికి విజయవాడ వేదిక అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 19న ఈ కార్యక్రమం జరగనుంది .
           శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన సంస్థ . భారతదేశంతో పాటు, మరో 7 దేశాలలో శ్రీశ్రీ కళావేదిక సంస్థ పనిచేయడం గమనార్హం. శ్రీశ్రీ కళావేదిక నెల నెలా నిజంగానే కవుల జాతర చేస్తుంది. వారు చేస్తున్న కవిసమ్మేళనం పండగ వాతావరణంలా సాగుతోంది. ఎక్కడా రాజీ పడకుండా ఎ.సి హాలు, ఉదయమే అల్పాహారం, మధ్యాహ్నం పెళ్లి భోజనంలా అనేక వంటకాలతో తృప్తిగా భోజనం, పాల్గొన్న కవులందరికీ పెద్ద పెద్ద గోల్డ్ కలరింగ్ మెమెంటోలు, నాణ్యమైన మంచి కలర్ ఫుల్ శాలువాలు, పూలదండతో ప్రశంసాపత్రం అందించి సాంప్రదాయబద్దంగా సన్మానం చేయడం ఒక్క శ్రీశ్రీ కళావేదికకే చెల్లింది. ఎందుకంటే, సాహిత్యం కూడా వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ఎలాంటి రుసుము తీసుకోకుండా శ్రీశ్రీ కళావేదిక నిస్వార్ధ సాహిత్య సేవ చేయడం అభినందనీయం. కవిసమ్మేళనం ఎనౌన్స్ చేసిన వెంటనే వందమంది పైబడి కవులు ఒక్క గంటలోనే పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అంటే, శ్రీ శ్రీ కళావేదిక ఒక బ్రాండ్ గా మారిందనే చెప్పవచ్చు . కొన్ని కొన్ని సాహిత్య కార్యక్రమాలకు కవులు, జనం లేక వెలవెలబోవడం అక్కడక్కాడా చూస్తున్నాము. జనాలను రప్పించడం కోసం అవార్డులు ఇస్తున్నాము అని ఆశ చూపించి రప్పించడం ఒక ఎత్తైతే, జనం రప్పించాలంటే ఫోన్లు చేసి మీ పేరు కవి సమ్మేళనంలో పెడుతున్నాను అని, లేదా మీ పుస్తకానికి అవార్డు ఇస్తున్నాము అని ఎర వేసి రప్పించడం మరో ఎత్తైంది. కాని ఇక్కడ కవుల జాతరే జాతర అన్నట్లు శ్రీశ్రీ కళావేదిక మారింది. సంవత్సరానికో, ఆరు నెలలకో ఒక కార్యక్రమం చేయడానికి కొన్ని సంస్థలు ప్రసవవేదన పడుతున్నాయి. కొందరు నిర్వాహకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దానికోసం కవుల దగ్గర రుసుము కూడా వసూలు చేసేవారు లేకపోలేదు. కానీ శ్రీశ్రీ కళావేదిక ద్వారా, నెల నెలా శతాధిక కవిసమ్మేళనాలు సముచితంగా జరపడం అనేది సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి.
          ఇదిలా ఉండగా 2023 ఏప్రియల్ నెలలో తిరుపతి మహతీ ఆడిటోరియంలో శ్రీశ్రీ కళావేదిక ఒక సాహిత్య సాహసానికి తెరతీసింది. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఎక్కడా జరగని విధంగా, 48 గంటలపాటు నాన్ స్టాప్ గా “ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు” నిర్వహించి అరుదైన రికార్డు నెలకొల్పింది. వేరేచోట ఎక్కడా కూడా 48 గంటలపాటు నిర్విరామంగా సాహిత్య కార్యక్రమం జరగలేదు. కవులు , కళాకారులతో శ్రీశ్రీ కళావేదిక మాత్రమే చేయగలిగింది. ఇదొక ప్రపంచ రికార్డు కూడా. కొన్ని కొన్ని సంస్థలు రెండు రోజులపాటు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ అవి రోజులో ఒక పూట మాత్రమే జరిగేవి. అలాకాకుండా డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా 3000 మంది కవులు, కళాకారులతో శ్రీశ్రీ కళావేదిక “ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మో త్సవాలు” నిర్వహించడం నిజంగా ఘనమైన రికార్డే. తాడేపల్లి గూడెంలో 24 గంటలపాటు నిర్విరామంగా ప్రపంచ తెలుగు కవితోత్సవం పేరిట 1500 మంది కవులతో రికార్డు సృష్టించడం, మంచిర్యాల జిల్లాలో 24 గంటలపాటు నాన్ స్టాప్ గా “రంగస్థలం” పేరిట కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసిన ఘనత ఒక్క శ్రీశ్రీ కళావేదికకే దక్కుతుంది. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో 200 మంది మహిళా కవయిత్రులతో జాతీయ ద్విశతక కవిసమ్మేళనం నిర్వహించి, “ఆమె” పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చిన క్రెడిట్ కూడా శ్రీశ్రీ కళావేదికకే దక్కుతుంది. కర్ణాటక రాష్ట్రం మైసూరులో తెలుగు – కన్నడ కవితాగోష్టి ఏర్పాటుచేసి 150 మంది తెలుగు-కన్నడ కవులతో కార్యక్రమం జరిపించడం శ్రీశ్రీ కళావేదిక ఘనతగా చెప్పవచ్చు. ఇంతటి బృహత్తర సాహిత్య కార్యక్రమాలు చేయడం అంటే మాటలు కాదు. అందరికీ భోజన వసతి కలిపించడం, జ్ఞాపికలు అందించడం, శాలువాలు, ప్రశంసాపత్రాలు ఇవ్వడం అంటే మాటలు కాదు. ఒక్క చిన్న సభ నిర్వహించడమే క్లిష్ట తరమైన ఈ రోజుల్లో భారీ సాహిత్యకార్యక్రమాలకు శ్రీశ్రీ కళావేదిక నాంది పలుకుతుంది అని చెప్పవచ్చు. అదే విధంగా సాహిత్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవలో కూడా శ్రీశ్రీ కళావేదిక ముందుంది అని చెప్పవచ్చు. నీలోఫర్ ఆసుపత్రిలో రోగులకు, బంధువులకు అన్నదాన కార్యక్రమం, ప్రతాప్ గారి పుట్టిన రోజు సందర్భంగా అనంతపురం, కందుకూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అన్నదానం, తాడేపల్లిగూడెంలో లెప్రసీ రోగులకు రగ్గులు పంపిణి చేయడం, హైదరాబాద్ లో డా. సతీష్ ఎర్రా హోమియో క్లినిక్ ఆధ్వర్యంలో నెల నెలా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, వరంగల్ పరకాలలో ఉచిత రక్తదాన శిబిరాల ఏర్పాటు, పేద విద్యార్దులకు ఆర్ధికసహాయం, కళాకారులకు ప్రోత్సాహం, శ్రీశ్రీ కళావేదిక పబ్లికేషన్స్ లలో 50 పుస్తకాలు ప్రచురణ చేయడం వంటివి సాగుతున్నాయి. ఇదంతా ఒక సాహితీ యజ్ఞం గానే చెప్పవచ్చు. నిరంతర సాహిత్య ప్రభంజనంగా పరిగణించవచ్చు. ఈ క్రతువులో మేము సైతం భాగస్వాములు కావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సాహితీ ప్రపంచంలో యువతరాన్ని తీర్చిదిద్ది పరంపర కొనసాగించే మహోన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్న శ్రీశ్రీ కళావేదికను మనసారా అభినందిద్దాం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way