దంపెట్ల శివ :
మానవసేవే మాధవ సేవగా భావించి చిన్న నాటి నుండి సేవాభావాలు కలిగిన దంపెట్ల శివ ఆపదలో ఎవరికి ఏం కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకు కదులుతారు. ఆ సేవాభావంతోనే ముక్కోటి అంబికా సేవా ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సమాజ సేవ అందిస్తున్నారు. బత్తలపల్లి మండలం దంపెట్ల గ్రామంలో నిరుపేద కుటుంబ౦ కొల్లా నాగన్న, కొల్లా నల్లమ్మల సంతానమే కొల్ల శివయ్య. ఆయన ఊరిపేరే ఇంటి పేరుగా మారడం జరిగింది. ఇంట్లో పూటగడవని పరిస్థితి. కానీ శివయ్యకు చదవాలన్న ఆసక్తి. ఆ పట్టుదలతోనే తల్లిదండ్రుల సహాకారంతో కాళసముద్రం రెసిడెన్సీయల్ ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి వరకు, కర్నూలు జిల్లాలోని చిన్న టేకూరులో ఇంటర్ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత టెక్నికల్ విద్య వైపు వెళ్దామన్నా ఆర్థిక ఇబ్బందులు తోడు అవడంతో అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ నందు డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఇంట్లో వారికి చేదోడు వాదోడుగా ఉండాలని సాఫ్ట్ టెక్ కంప్యూటర్ నందు ట్యూటర్ గా పని చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ అదే సాఫ్ట్ టెక్ కంప్యూటర్ లో మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఆనంతరం సొంతంగా శివకుమార్ సాఫ్ట్ టెక్నాలజీ కంపెనీని సొంతంగా ప్రారంభించారు.
సమాజ సేవలో తమ జీవితాలను అంకితం చేసిన మదర్ థెరిస్సా, ఫాదర్ విన్సెంట్ పెర్రర్ లాంటి గొప్ప వ్యక్తులు ఎక్కడో విదేశాల్లో పుట్టి పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తున్న గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని తన చుట్టూ సమాజంలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేయాలని కోరుతుంటారు. సమాజం తనకు ఎంతో ఇచ్చిందని తిరిగి తన సంపాదనలో 50% సమాజం అవసరం కోసం, అవసరంలో ఉన్న వారిని గుర్తించి సహాయ సహకారాలు అందించి సేవ చేయాలనే ఉద్దేశంతో ” ముక్కోటి అంబికా సేవా ఛారిటబుల్ ట్రస్టు ” ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మనిషి పుట్టాక వయసు పెరిగే కొద్దీ మనిషి జీవితం ఆప్యాయతకు మంచితనానికి చిరునామా కావాలని, అహంకారానికి ద్వేషానికి గొడవలకు మూలం కాకూడదంటారు. అదే విధంగా నచ్చితే నలుగురిని ప్రేమించు. కుదిరితే పదిమందికి సహాయం చెయ్యి.. వీలైతే 100 మందికి దారి చూపు… అప్పుడు నీ జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటావని దంపెట్ల కొల్ల శివయ్య చెబుతారు.
ఉద్యమబాటలో ప్రజలకు సేవలు :
2018-2020 వ సంవత్సరంలో ఎస్.సి జనసంఘం నందు అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి పేదలకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమంలో కదిరి నుండి అనంతపురం కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి దళితులకు జిల్లా వ్యాప్తంగా దళితులకు అందవలసిన 400 ఎకరాల దాకా ప్రభుత్వం భూ పంపిణీ చేసే విధంగా నిర్విరామంగా కృషి చేశారు. అదేవిధంగా స్వచ్చందంగా ఎస్సీ కార్పోరేషన్ ద్వారా బోర్లు వేసుకున్న రైతుల కోసం కరెంటు, పైపులు ఉచిత మోటర్లు తదితర వాటికోసం వారికి అందజేసే విధంగా కృషి చేయడం జరిగింది. ధర్మవరం నియోజకవర్గంలో సాగు-త్రాగు నీటి కోసం విద్యా-వైద్యం కోసం అణగారిన వర్గాల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ ఆ ప్రాంత ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. ఇల్లులేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించాలని డప్పు కళాకారులకు, చర్మ కార్మికులకు రూ.2000/-లు వరకు ఫించన్లు, ఇప్పించడంలో నిరంతర పోరాటం చేశారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలకపాత్ర :
అనంతపురం జిల్లాలో కరువు కాటకాలకు నిలయమై, యువత ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. యువతకు దిశా నిర్దేశం చేసే ప్రభుత్వ స్పందన అంతంత మాత్రమే. ఈ విషయాన్ని గమనించిన కోల్ల శివయ్య యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనుకున్నారు. అందుకు అన్వేషణ మొదలుపెట్టారు. యువతకు ట్రైనింగ్ ఇచ్చి, ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించాలని ధృడ సంకల్పించుకున్నారు. ఫలితంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా ఫారెన్ లాంగ్వేజ్ (కొరియన్, జపనీస్, స్పానిస్) ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. 6 నెలల కోచింగ్ అనంతరం వీరికి ట్రస్ట్ సర్టిఫికేట్ అందిస్తూ, ట్రస్ట్ తరుపున ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుంది. MNC companies, NGO’S మరియు ఫారిన్ దేశాల యందు లాంగ్వేజ్ ట్రాన్సల్టేర్స్ గా ఉద్యోగాలు కలిపించడం జరుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, ఫీజులు చెల్లించడం కూడా చేస్తూ యువతకు అండగా నిలిచారు.
మహిళలకు ఉపాధి అవకాశాలు :
జిల్లాలో కరువు తాండవిస్తున్న వేళ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అనుకున్నారు. మహిళలు వారే స్వతంత్ర శక్తితో ఎదగాలని, స్వంతంగా చేతి వృత్తి కళలతో ఆదాయ మార్గాలు అన్వేషించుకునేలా సహాయం చేయాలనుకున్నారు. ఉరవకొండ మండల పరిధిలోని మోపిడి గ్రామంలో మహిళలను ఆర్థికంగా చైతన్య పరచాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ట్రైనింగ్ అనంతరం కుట్టుమిషన్ నేర్చుకోవడానికి వచ్చిన మహిళలకు ఐడి కార్డులతో పాటు కుట్టు మిషన్ కూడా ఉచితంగా పంపిణీ చేశారు. అదేవిధంగా బండమీద పల్లి గ్రామంలో కుట్టుమిషన్ మహిళలకు అవగాహన సదాసులు ఏర్పాటు చేసి, భవిష్యత్తులో కూడా ఉచితంగా కుట్టు మిషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమల దొడ్డి గ్రామంలో వికలాంగులకు, మహిళలకు చేయూత ఇవ్వాలని ఉద్దేశంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. అనంతరం దాదాపు 30 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశామని అదేవిధంగా వికలాంగులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేశామని ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలిపారు. క్రీడా రంగంలో మహిళలు మరింత మంది ఎదగాలని, ఆ దిశగా ప్రతి ఒక్క అమ్మాయి అడుగులు వేయాలని కోరుకున్నారు. కొర్రపాడులో ఉన్న అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నందు ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కిట్స్ అందించారు. భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు స్పొర్ట్స్ కిట్స్ అందించేలా కృషి చేస్తామని అన్నారు.
అనాధలకు, వృద్ధులకు ఆశ్రమాలు :
గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రులను ఇద్దర్నీ పోగొట్టుకొని దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి నిరుపేద విద్యార్థులను గుర్తించి దత్తత తీసుకొని దాదాపు 32 మంది బాలికలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో కాకినాడ సమీపంలోని ఏలూరులో కరుణ చిల్డ్రన్ హోమ్ లో ఎనిమిది మంది, బెంగళూరులో క్రిస్టియన్ కర్మేల్ చిల్డ్రన్ హోమ్ లో 18 మంది, అనంతపురంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల, గార్లదిన్నెలో మైనారిటీ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా చదువుకోవడానికి సదుపాయాలు కల్పిస్తూ వారికి కావలసినటువంటి అన్ని అవసరాలను తీరుస్తూ నిరుపేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2015 సంవత్సరంలో గుంతకల్లు నందు ఆశాజ్యోతి ఓల్డేజ్ హోమ్ స్థాపించి కొన్ని వందలమంది వృద్ధులకు వసతి కల్పించడం జరిగింది. 2016-2017 వ సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నందు కరుణ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటి నందు సెక్రెటరీగా పనిచేస్తూ స్వతహాగా చిల్డ్రన్ హోమ్ స్థాపించి కొంతమంది అనాధపిల్లలకు వసతి కల్పించడం జరిగింది. నార్పల మండలం బొమ్మలాటపల్లి గ్రామ సమీపంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి, సమాజంలో నిరుపేద వృద్ధులను చేరదీసి వారికి వసతి కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.
కళాకారులకు అండగా :
కళాకారులకు ప్రోత్సాహకాలు మారుతున్న కాలంతో పాటు మన పూర్వీకులు నేర్పిన కలను గుర్తించాలన్న అవసరం ఎంతైనా ఉందని భావించి ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాకారులకు ప్రోత్సాహకాలు, సన్మానాలు, నిత్యావసర సరుకులు లాంటివి అందిస్తున్నామన్నారు. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు కళలను నేటి సమాజంలో యువతరానికి పరిచయం చేస్తూ కళల యొక్క గొప్పతనాన్ని అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డప్పు కళాకారులకు, చర్మ కార్మికులకు రూ.2000/-లు వరకు ఫించన్లు, ఇప్పించడంలో నిరంతర పోరాటం చేశానని తెలిపారు. అందుకోసం ప్రభుత్వంతో నిరంతర పోరాటం చేశానని తెలిపారు. గ్రామాలలో కళలను పెంపొందించేలా కార్యక్రమాలను చేపడతామని తద్వారా ఈ తరం యువతకు కళల మీద మక్కువ ఏర్పడేలా చేస్తామని తెలిపారు.
కరోనా సమయంలో అండగా :
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో అనేకమంది ప్రజలు కరోనా బారినపడి ప్రాణాలు పోతున్న సమయంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఆ సమయంలో ఎంతోమంది వలస కూలీలు ఉపాధిని కోల్పోయారు. చాలామంది నిరుపేదలు చేయడానికి పని లేక, తినడానికి తిండి లేక, బంధువుల ప్రేమ ఆప్యాయతలు దూరమై ఆకలితో అలమటిస్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్న సమయంలో నీ కష్టంలో నేను సైతం అంటూ కష్టపడి సంపాదించిన ఆస్తిని నగలను అమ్మి, నిత్యవసరకులతో పాటు అవసరమైన సహాయ సహకారాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో తన కుటుంబ సభ్యుల సహకారంతో చేశారు. కొన్ని వేల కుటుంబాలకు మాస్కూలు, శానిటైజర్లు అందించారు. పేదలకు నిత్యావసర సరుకులు, కాయగూరలు అందించి కరోనా సమయంలో విస్కృతమైన సేవలు అందించారు. సమాజంలో వివిధ రకాలుగా సహాయం చేస్తున్న జర్నలిస్టులు, పాస్టర్లు, పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు కరోనా సమయంలో అండగా నిలిచారు.
నిరుపేదలకు బాసటగా :
గ్రామీణ ప్రాంతాలలో చదవాలని ఆశ వుండి చదవలేకపోతున్న చిన్నారులను గుర్తించి వారితో పాటు, ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను గుర్తించి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు అందిస్తున్నారు. శ్రీమంతాలు చేసుకోలేని నిరుపేద మహిళలకు కూడా సమాజంలో ఉన్నారని అలాంటి వారికి బంధువుల సహాయ సహకారాలు అందించకపోయినా మేమున్నామంటూ ముక్కోటి అంబికా సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నిరుపేదలకు పెళ్లిళ్లు చేయడంలో సమాజంలో పెళ్లి వయసు వచ్చినప్పటి నుండి బంధువులు పట్టించుకోకుండా, ఇబ్బందులు, సమస్యలను, పరిస్థితులను ఆయా గ్రామాలలోని పెద్దలు ద్వారా తెలుసుకున్న అనంతరం అలాంటి వారికి ట్రస్టు ద్వారా సొంత ఖర్చులతో నిరుపేదలకు పెళ్లిళ్లు సైతం చేస్తున్నట్లు తెలిపారు.
రాజకీయ జీవితం :
ముక్కోటి అంబికా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక పక్క సేవలు అందిస్తూనే, మరో పక్క రాజకీయంగా ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలు, ఆశయాలు నచ్చి ఆయన బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం విస్కృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత పార్టీ ఓడిపోయినా జనసేన పార్టీ ద్వారా ప్రజలలో చేరువ అవుతూ వారి మన్నలను పొందుతున్నారు. జనసేన పార్టీ ఆదేశించిన సూచనల మేరకు కార్యకమాలు చేస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు చేరువ అవుతున్నారు. శింగనమల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతూ, సామాన్యుల కష్టాలు తెలుసుకొని వాటి పరిష్కార ధ్యేయంగా కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ ద్వారా మరింత బలంగా ప్రజల్లోకి వెళ్ళి జనసేన పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. అలాగే శింగనమల అభివృద్ధి కోసం పాటు పడతానని తెలిపారు.