విజయనగరం ( జనస్వరం ) : రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. విజయనగరం పట్టణంలో 12 వ డివిజన్ లో ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి , ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని.. జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ టీడీపీ అనుభవం, జనసేన యువరక్తం కలిస్తే రాష్ట్రానికి అద్భుత పరిపాలన వస్తుందన్న పవన్ కల్యాణ్ మాటలు అక్షర సత్యాలని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనపై పవనకల్యాణ్ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని చెప్పడం శుభసంకేతమన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈ దుర్మార్గపు పాలన అంతమవుతుందన్నారు. జగన్మోహన్‌రెడ్డికి గుణపాఠం తప్పదన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, ఎక్కడ చూసినా అవినీతి తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు.
విజయనగరం పట్టణంలో సుందరీకరణ పేరుతో నిధులు దోచుకుంటున్నారని ఆరోపించారు. న్యాయపరమైన సమస్యలు తొలగిపోయినా అంబటిసత్రం- వాటర్ ట్యాంక్ రోడ్డు విస్తరణ పూర్తిచేయకపోవడం సిగ్గుచేటు అన్నారు…అక్రమాలకు, అవినీతి, అరాచకాలకు అడ్డాగా మారిన ముఖ్యమంత్రి జగన్‌కు మరలా ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. వచ్చేది నీతి, నిజాయతీ గల ప్రజా ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు టిడిపి నాయకులు గొలగాన సురేంద్ర, ఇప్పిలి రామారావు నాయకత్వంలో టిడిపి కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు జనసేన నాయకులు కొర్నాన శ్రీకాంత్, కొయ్యాన లక్ష్మణ యాదవ్, కె.సాయి, రాజు, పట్ణణ జనసేన నేతలు డి.రామచంద్రరాజు, కాటం అశ్విని, మాతా గాయిత్రి, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, రవితేజ, రవీంద్ర, పిడుగు సతీష్, దుప్పాడ నరేష్, ఎమ్ .పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, కంది సురేష్ కుమార్, వెంకట రమణ, మధు, తదితరులు పాల్గొన్నారు