తిరుపతి ( జనస్వరం ) : ప్రజారంజక పాలన అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పాలకుడు శ్రీకృష్ణదేవరాయల వారని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు వర్ధంతి సందర్భంగా జనసేన నాయకులతో కలిసి రాయలవారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఎంతో మంది రాజులు, చక్రవర్తులు పరిపాలిస్తే అందులో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన రాజుల్లో అగ్రగణ్యుడు శ్రీకృష్ణ దేవరాయులేనన్నారు. ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేదన్నారు. ఆయన తవ్వించిన చెరువులే నేటికీ సాగునీరు, తాగునీరు అందిస్తున్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక అనేక మంది పాలకులు చెరువులను పూడ్చారే తప్ప కొత్త చెరువులను తవ్వించలేకపోయారన్నారు. ఆ రోజుల్లోనే పాదాచారులతో పాటు ప్రయాణం చేసేందుకు రహదారులను నిర్మించిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలని కొనియాడారు. కళలను ప్రోత్సహించడమే కాకుండా కళాకారులనూ పోషించారన్నారు. తిరుమల శ్రీవారిని ఏడుసార్లు దర్శించుకొని అనూచానంగా కానుకలు సమర్పించారన్నారు.
ఆనాటి రాయల పాలన ఈనాటి పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమన్నారు. ప్రజల మనసులను తెలుసుకొని పరిపాలన దక్షత ఉన్న నాయకుడు పవన్ కళ్యాణే అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో రాయల పాలన రాబోతోందని, ప్రజలంతా సుభిక్షంగా ఉండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయల్, కార్యదర్శి ఆనంద్, దేవర మనోహర్, సీనియర్ నాయకులు ఈశ్వర్ రాయల్, నగర ఉపాధ్యక్షురలు లక్ష్మి, కొండా రాజమోహన్, నగర కార్యదర్శులు కిరణ్ కుమార్, దిలీప్, కిరణ్, పురుషోత్తం, హేమంత్, లోహిత్ రాయల్, వీరమహిళలు దివ్య, మధులత, లావణ్య, దుర్గ, చందన, రేఖ, తిరుపతి రూరల్ నాయకులు రాయల్ వెంకట్, యువ కిషోర్, జనసేన సాయి, కిరణ్ కుమార్, జనసైనికులు మోహిత్ తదితరులు పాల్గొన్నారు.