పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత వైసీపీ కి లేదు

పవన్ కళ్యాణ్

    కడప ( జనస్వరం ) : మండల కేంద్రమైన సిద్ధవటం జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు కే రాజేష్ మాట్లాడుతూ మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వైసీపీ పదేపదే విమర్శలు చేయడం తప్ప మీరు రాష్ట్రానికి ఏమి సాధించారో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు.  బహిరంగ సభలో  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని చెప్పడం పదే పదే వైసీపీ పనిగట్టుకొని విమర్శలు చేయడం మీ పరువు మీరే తీసుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై అక్రమ కేసులు పెట్టడం కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప రాష్ట్రానికి ఏమి చేశారో మీరు చెప్పాలి తప్ప పవన్ కళ్యాణ్ పై టార్గెట్ పెట్టడం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మా పార్టీ పొత్తు మా నాయకులు చూసుకుంటారని, వైసీపీ పార్టీకి మా పార్టీతో మా పొత్తులతో మీకు ఏమి సంబంధం అని అన్నారు. ఏపీ రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పాలని యువత ఉద్యోగులకు పోయినప్పుడు వారి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు.  రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని ఎంతసేపు ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఏమి సాధించారు. అ ప్రతిపక్షాలపై విమర్శలు మానుకొని మీ పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఫ్యాక్టరీలు రాష్ట్రానికి తెచ్చారో అవి బహిరంగంగా తెలపాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని అన్నారు. వాలంటరీ వ్యవస్థ పై నిజాలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై కేసులు పెట్టడం ఇంత దుర్మార్గపు పాలన ఎక్కడా లేదని మండల జనసేన పార్టీ అధ్యక్షులు రాజేష్ అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way